Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆవిష్కరణకు సంబంధించిన ఆలోచన మీ జీవితాన్ని మార్చివేస్తుందని మీరు భావిస్తున్నారా మరియు మీరు భారీ స్థాయిలో ముందుకు కొనసాగేందుకు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నారా? భవిష్యత్తు తరాల వాస్తవికతను శాశ్వతంగా మార్చగలిగేలా మీరు ఏదైనా సృష్టించగలరని మీరు ఎప్పుడైనా భావించారా? ఇదిగో, అలా అయితే, కలర్స్ ఇన్ఫినిటీ ప్రకటించిన ‘ది ఇన్వెంటర్ ఛాలెంజ్’ మీకు ఒక పెద్ద అవకాశాన్ని కల్పిస్తోంది. విలక్షణమైన రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో, ది ఇన్వెంటర్ ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా చక్కని ప్రతిభావంతులైన వ్యక్తుల కోసం ఒక ఐడియా ఇంక్యుబేషన్ ప్లాట్‌ఫారాన్ని సిద్ధం చేసింది. భారతీయులు తమ సృష్టిని ప్రదర్శించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రతిభావంతమైన ఆలోచనలను కాగితం నుంచి వర్కింగ్ ప్రోటోటైప్లకు అనువదించేందుకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఇన్వెంటర్ ఛాలెంజ్ అనేది ప్రముఖ ఎమ్మీ అవార్డ్ విన్నింగ్ షో ఎవ్రీడే ఎడిసన్స్కు భారతీయ అనుసరణ కాగ, భారతదేశపు తదుపరి పెద్ద ఆవిష్కర్తను కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ షో మల్టీ-ప్లాట్‌ఫారమ్ విధానాన్ని కలిగి ఉంటుంది మరియు త్వరలో కలర్స్ ఇన్ఫినిటీతో పాటు మా డిజిటల్ డెస్టినేషన్లలో అందుబాటులో ఉంటూ, ఎక్కువ మందిని గరిష్టంగా చేరుకోవడం మరియు అనుసరించడాన్ని నిర్ధారిస్తుంది.
ప్రతి ఎపిసోడ్లో వీక్షకులు వివిధ ఔత్సాహిక ఆవిష్కర్తలను, వారి ఆలోచనలను డైనమిక్ ప్యానెల్‌కు పిచ్ చేస్తారని ఆశించవచ్చు మరియు వీటి ఫలితాలను త్వరలో ప్రసారం చేస్తారు. ప్యానెలిస్ట్‌లు తదుపరి రౌండ్‌కి వెళ్లేందుకు కొంతమంది పార్టిసిపెంట్లను ఎంచుకుని, ఆవిష్కర్తల ఆలోచనలను సజీవంగా ఉంచుతారు. ప్రత్యేకంగా రూపొందించిన ల్యాబ్‌లో వారి ఆవిష్కరణలను రూపొందించడంలో సహాయపడేందుకు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి మార్గదర్శకులు కేటాయించబడతారు. వారు తమ ఆలోచనలకు జీవం పోసి, తుది ఉత్పత్తిని వినియోగదారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వారి మొత్తం ప్రయాణం మొత్తం ఆవిష్కృతమవుతుంది. జాష్ గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టెడ్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం గతంలో మాకు చాలా గుర్తింపును తీసుకు వచ్చింది. భారతదేశం ఆవిష్కరణలకు హాట్‌స్పాట్ అని మనందరికీ తెలుసు మరియు వర్ధమాన ప్రతిభకు ఇక్కడ చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయి. ది ఇన్వెంటర్ ఛాలెంజ్ కోసం కలర్స్ ఇన్ఫినిటీని మా భాగస్వాములుగా కలిగి ఉండటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మరియు భారతదేశంలో మా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు మేము వేచి చూస్తున్నాము’’ అని తెలిపారు.
కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భంలో వయాకామ్ 18 యూత్, మ్యూజిక్ అండ్ ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ హెడ్ అన్షుల్ ఐలవాడి మాట్లాడుతూ, “ఈనాటి భారతదేశం సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల ఆలోచనలకు సారవంతమైన నేల. ఇన్వెంటర్ ఛాలెంజ్ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలను వాస్తవ రూపం ఇచ్చేందుకు ఒక సమగ్ర వేదిక. ఇది చాలా డిమాండింగ్ జర్నీ మరియు కలర్స్ ఇన్ఫినిటీలో మేము ఇందులో భాగమైనందుకు సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
~ కలర్స్ ఇన్ఫినిటీలో ప్రసారం కానున్న రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో ‘ది ఇన్వెంటర్ ఛాలెంజ్’లో పాల్గొనేందుకు మీ ఆలోచనలను పదును పెట్టుకోండి మరియు మీ దరఖాస్తులు పంపండి.