Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 149 పాయింట్ల క్షీణత
- వీడని రష్యా-ఉక్రెయిన్ భయాలు
ముంబయి : స్టాక్ మార్కెట్లను రష్యా-ఉక్రెయిన్ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సోమవారం ఇంట్రాడేలో బిఎస్ఇ సెన్సెక్స్ ఏకంగా 976 పాయింట్లు కోల్పోయింది. తుదకు 149 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 57,683.5 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 17,207 వద్ద నమోదయ్యింది. విప్రో, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్, నెస్ల్టే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సూచీలు 1.7 శాతం వరకు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హిందాల్కో, యుపిఎల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, దివీస్ లాబ్స్, టిసిఎస్ షేర్లు 3.45 శాతం వరకు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. నిఫ్టీలో మీడియా, లోహ సూచీలు 2.7 శాతం, 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. ఇదే క్రమంలో ఫార్మా, పిఎస్బి సూచీలు 1.4 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.