Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చెన్నై - డైమ్లెర్ ట్రక్ ఏజీలో 100% అనుబంధ సంస్థగా కొనసాగుతున్న డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (DICV), నేడు మహీంద్రా ఎంఎస్టీసీ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (MMRPL) యాజమాన్యంలోని స్క్రాపేజ్ మరియు స్టీల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెరో (CERO)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. వాహన యజమానులకు ఈ భాగస్వామ్యం దృఢమైన మద్దతు మరియు అడ్డంకులు లేని సేవలను అందిస్తుంది. వారి ఎండ్ ఆఫ్ లైఫ్ (ELV) వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేసేందుకు మరియు వాటి స్థానాన్ని కొత్త భారత్‌బెంజ్ ట్రక్కులతో భర్తీ చేసుకునేందుకు వారికి సహకరిస్తుంది. వాహన ధర మదింపు ప్రక్రియ నుంచి CoD (సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్) రసీదు వరకు వినియోగదారులకు వారి పాత ట్రక్కులను స్క్రాప్ చేసేందుకు ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందించే లక్ష్యాన్ని డిఐసివి (DICV) కలిగి ఉంది. సెరో (CERO) అనేది భారతదేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత ఆటోమొబైల్ రీసైక్లింగ్ ప్రయత్నం కాగా, ELVల నుంచి లోహాలను పర్యావరణ హిత పద్ధతులను వినియోగించి రీసైక్లింగ్ చేస్తూ, కర్బన ఉద్గారాల అడుగుజాడలను తగ్గించే దిశలో ప్రారంభమైంది. డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ సత్యకం ఆర్య మాట్లాడుతూ, “కర్బన ఉద్గారాల అడుగు జాడలు తగ్గించేందుకు మరియు భారతీయ రహదారుల పైనుంచి పాత, కాలుష్యాన్ని కలిగించే వాహనాలను తగ్గించడంలో స్క్రాపేజ్ ఒక ముఖ్యమైన అడుగు మరియు ఈ సమయంలో ఇది అత్యవసరమని చెప్పవచ్చు. వినియోగదారులు తమ పాత వాహనాల స్థానంలో కొత్త బిఎస్4 భారత్‌బెంజ్ ట్రక్కులను భర్తీ చేసుకునేందుకు ఇది ఒక చక్కని అవకాశం. భారతదేశంలో స్థానికంగా తయారవుతున్న ఈ వాహనాలు భద్రత, నాణ్యత, సౌకర్యం మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. స్క్రాపేజ్ విధానాన్ని సమర్థవంతంగా జారీ చేస్తూ, కొత్త ట్రక్కుల విక్రయాలను ఉన్నతంగా చేసేందుకు అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని తెలిపారు. భారత్‌బెంజ్ మార్కెటింగ్, సేల్స్ మరియు కస్టమర్ సర్వీస్, డిఐసివి ఉపాధ్యక్షుడు- రాజారామ్ కృష్ణమూర్తి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, “వినియోగదారులు తమ జీవితాంతం వాణిజ్య వాహనాలను కొత్త భారత్‌బెంజ్ ట్రక్కులతో భర్తీ చేయడంలో సహాయపడటానికి సెరో (CERO)తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. స్క్రాపేజ్తో మెరుగైన ఇంధన సామర్థ్యం, విశ్వసనీయత మరియు ఆధునిక సాంకేతికత పని చేసే వాహనాలను తక్కువ ధరలో సొంతం చేసుకుకోవడం పాటు పర్యావరణానికి హితమైన మార్గం’’ అని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం గురించి మహీంద్రా ఇంటర్‌ట్రేడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు MMRPL డైరెక్టర్ సుమిత్ ఇస్సార్ మాట్లాడుతూ, “ఈ ప్రయత్నాన్ని చేపట్టినందుకు ముందుగా మేము డిఐసివి (DICV)ను అభినందించాలని కోరుకుంటున్నాము. సెరో అనేది అనేది పిపిపి (PPP) మోడల్లో ఉత్పత్తి చేసిన మోటారు వాహనాలకు భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ అధీకృత రీసైక్లర్ కాగా, వాహన రీసైక్లింగ్ సమయంలో కాలుష్యాన్ని జీరోగా ఉంచడంపై దృష్టి సారించింది. మేము దేశవ్యాప్తంగా 20+ నగరాల్లో ఉనికిని కలిగి ఉన్నాము. సెరో రానున్న రాబోయే 8-10 నెలల్లో 30+ నగరాల్లో తన ఉనికిని విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించుకుంది. డిఐసివి రూపొందించిన విధానం వినియోగదారులకు మొత్తం ప్రక్రియను ఎటువంటి అడ్డకుంలు లేకుండా చేయడంపై దృష్టి సారిస్తోంది. వారి పాత వాహనాలను స్క్రాప్ చేసేందుకు మరియు వాటిని డిఐసివి వాహనాలతో భర్తీ చేసేందుకు పరిష్కారాలను వెతుకుతున్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురావడం మరియు ప్రయోజనాలను అందించడంపై దృష్టి సారిస్తోంది’’ అని వివరించారు. ప్రపంచంలో అత్యంత 10 కలుషిత నగరాలలో, వాహనాల కాలుష్యంతో సమస్య ఎదుర్కొంటున్న మూడు నగరాలు భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ ఎన్‌సిఆర్ వంటి నగరాల్లో దాదాపు 15-30% వాహన కాలుష్యమే ఎక్కువగా ఉంది. వాహనాల స్క్రాపింగ్ సౌకర్యంతో అనుచితమైన, కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్థిరమైన మార్గంలో క్రమంగా తొలగించేందుకు సహకరిస్తాయి మరియు కొత్త వాహన విక్రయాలకు ఊతాన్ని అందిస్తాయి. భారత్‌బెంజ్ డీలర్‌షిప్‌లు ఇప్పుడు వినియోగదారుల ELVలను స్క్రాప్ చేసేందుకు సెరో ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించుకోవచ్చు. కఠినమైన శిక్షణ కలిగి ఉన్న డీలర్షిప్ బృందాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తాయి. ఈ సహకార ప్రయత్నాన్ని డీలర్‌షిప్‌లు తమ సేవల స్థాయిని విస్తరించుకునేందుకు, వినియోగదారులను ఆకర్షించేందుకు మరియు పర్యావరణ హితానికి దోహదపడేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది.