Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :షార్ప్ కార్పోరేషన్ జపాన్‌కు పూర్తి అనుబంధ భారతీయ సంస్థగా వెలుగొందుతున్న షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తమ నూతన శ్రేణి ఏ3 పరిమాణపు మోనో మల్టీ ఫంక్షన్ ప్రింటర్ (ఎంఎఫ్పీ) సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో BP-30M35T, BP-30M35, BP-30M31, BP-30M28T and BP-30M28 వంటివి ఉన్నాయి. దీనియొక్క సౌకర్యవంతమైన ఫుట్‌ప్రింట్, వైర్లెస్ సామర్ధ్యం మరియు అత్యాధునిక డాటా సెక్యూరిటీ ఫీచర్లతో ఈ నూతన ప్రింటర్ సిరీస్ అత్యంత సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఎలాంటి ఆఫీస్ వాతావరణంలో అయినా ఇమిడి పోవడంతో పాటుగా ప్రింటింగ్ సామర్థ్యం మెరుగుపరచడం, రిమోట్ వర్కింగ్‌కు తోడ్పడటం మరియు వైవిధ్యమైన డాక్యుమెంటేషన్ అవసరాలను తీర్చడం చేయనుంది. ఈ మల్టీ ఫంక్షన్ ప్రింటర్స్ అత్యంత సహజసిద్ధమైన వినియోగదారుల అనుభవాలను వరుసగా 35పీపీఎం, 31పీపీఎం మరియు 28పీపీఎం ప్రింట్ స్పీడ్‌తో అందిస్తుంది. ఈ ఆవిష్కరణ డాక్యుమెంటేషన్ వ్యాపారంలో షార్ప్ యొక్క 50వ వార్షికోత్సవ వేడుకలకు సైతం ప్రతీకగా నిలుస్తుంది. ఈ నూతన సిరీస్‌లో 7 అంగుళాల టచ్ స్ర్కీన్, ఈజీయుఐ, డ్యూయల్ నెట్వర్క్ మద్దతు, సర్వర్ రహిత ప్రింట్ విడుదల మరియు డాటా ఎన్క్రిప్షన్, స్టాండర్డ్ డుప్లెక్స్ మరియు నెట్వర్క్, రెండు 500 షీట్స్ ట్రే సామర్థ్యం వంటివి ఉంటాయి. ఇవి పెద్ద మరియు మధ్య తరహా కార్పోరేట్స్, బీఎఫ్ఎస్ఐ, ప్రభుత్వ పరిశ్రమలు, హెల్త్‌కేర్, విద్య, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఇంజినీరింగ్ డిజైనింగ్ సంస్థలు, ఇంటిలిజెంట్, ఫ్లెక్సిబల్, సురక్షిత పరిష్కారాలను కోరుకునే ఆధునిక రిటైల్ సంస్ధలు కోసం అవసరమైన వ్యాపారడాక్యుమెంటేషన్ అవసరాలను ఇవి తీర్చనున్నాయి.
ఈ సందర్భంగా షింజీ మినటోగవా, మేనేజింగ్ డైరెక్టర్, షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘షార్ప్ వద్ద, మేము కేవలం మా వ్యాపార పరిమాణం పెంచుకోవడం మాత్రమే చూడటం లేదు. దానికి బదులుగా మేము మా వినూత్నమైన, సృజనాత్మక సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంస్కృతి, ప్రయోజనాలు మరియు సంక్షేమం కోసం అందిస్తున్నాము. గత ఐదు దశాబ్దాలుగా మా ప్రయాణంలో దానిని ప్రతిబింబిస్తుడటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా అత్యాధునిక డాక్యుమెంటేషన్ వ్యవస్థలతో మా వ్యాపార కార్యకలాపాలను సమూలంగా మారుస్తున్నాము. మా తాజా ఎంఎఫ్పీ సిరీస్‌ను మా మహోన్నతమైన ఆవిష్కరణల వారసత్వంతో తీర్చిదిద్దాము. ఇవి పరిశ్రమలో మహోన్నతైన ఫీచర్లను అందించడంతో పాటుగా తమ శ్రేణిలో అత్యద్భుతమైన అనుభవాలను అందిస్తుంది. ఇది వ్యాపార ఫలితాలను మెరుగుపరచడంతో పాటుగా వ్యాపార కొనసాగింపు ప్రయత్నాలను సైతం మెరుగుపరుస్తాయి’’ అని అన్నారు. ఎంఎఫ్పీ 4జీబీ మెమరీ మరియు 128జీబీ నుంచి 512 జీబీ ఎస్ఎస్డీ నిల్వ సామర్థ్యంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది పీసీఎల్ ప్రింటింగ్, వేగవంతమైన వార్మప్ కాలం, 2100 షీట్ల వరకూ ఏకధాటిగా కాపీయింగ్/ప్రింటింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అంతేకాదు, స్పేస్ ఎఫీషియెంట్ ఇన్నర్ ఫినీషర్ అవకాశాన్ని సైతం కలిగి ఉండటం వల్ల ఈ ఎంఎఫ్పీ,ఉత్పాదకతను గణనీయంగా డాక్యుమెంట్ వర్గీకరణ, స్టాప్లింగ్ ప్రక్రియ కూడా మరింత సులభమవుతుంది. ప్రొఫెషనల్‌గా పూర్తి చేసే కార్పోరేట్ డాక్యుమెంట్ల కోసం ఈ ఎంఎఫ్పీ విభిన్నమైన పేపర్ మీడియాకు మద్దతునందిస్తుంది. ప్రామాణిక పేపర్ పరిమాణాల నుంచి గరిష్టంగా ఏ3 మరియు పేపర్ మందం 5 నుంచి 200 జీఎస్ఎం వరకూ మద్దతునందిస్తుంది. వేగవంతమైన నెట్వర్క్ రెడీ ఎంఎఫ్పీ , వేగవంతమైన ఔట్‌పుట్‌ను అందించడంతో పాటుగా వినూత్నమైన ఫంక్షనాలిటీ మరియు పలు ఉత్పాదకత ఫీచర్లను సైతం అందిస్తుంది. ఇది అన్ని ప్రింటింగ్, కాపీయింగ్, మరియు కలర్ స్కానింగ్ అవసరాలను తీరుస్తుంది. దీనిలోని ప్రధాన ఆకర్షణలలో సెకండరీ ఎథర్నెట్ పోర్ట్, మల్టీమీడియా స్కాన్ డెస్టినేషన్స్ నుంచి ఈ మెయిల్, ఎఫ్టీపీ సర్వర్, నెట్వర్క్ ఫోల్డర్, ఎస్ఎస్డీ, డెస్క్‌టాప్, యుఎస్బీ డ్రైవ్ ఉన్నాయి. ఇది అత్యంత వేగవంతమైన స్కానింగ్‌ను నిమిషానికి 60 ఒరిజినల్స్‌ను 100 షీట్ల రివర్శ్ సింగిల్ పాస్ ఫీడర్‌తో అందిస్తుంది. ఇది సౌకర్యవంతమైన బైపాస్ ట్రే మరియు వేగవంతమైన స్టాటస్ ఇండికేటర్‌ను ప్రింట్ జాబ్స్ కోసం ప్రదర్శిస్తుంది. ఈ నూతన ఎంఎఫ్పీ సిరీస్ టాండమ్ ప్రింట్ మరియు కాపీ అవకాశాలతో వస్తుంది. ఇది భారీ పరిమాణంలో టాస్క్స్ అయినటువంటి ప్రశ్నాపత్రపు ప్రింటింగ్ లేదా నిర్థిష్ట సమయంలో బహుళ సెట్స్ ప్రింటింగ్ చేయాలంటే ప్రింటింగ్ సమయం తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఈ నూతన ప్రింటర్ శ్రేణి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వస్తాయి. ఈ ఎంఎఫ్పీ సిరీస్ ఆప్షనల్ క్యుసీఆర్ సామర్థ్యంతో సైతం వస్తుంది. ఇది స్కాన్డ్ డాక్యుమెంట్‌ను వెదకతగిన పీడీఎఫ్ ఫైల్స్ లేదా ఎడిట్ చేయతగిన ఆఫీస్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌గా మారుస్తుంది. ఒకేసారి బహుళ బిజినెస్ కార్డులను సైతం ఎంఎఫ్పీ స్కాన్ చేయగలదు. ఓసీఆర్ ఫంక్షన్ ద్వారా ఇది ప్రతి బిజినెస్ కార్డు వివరాన్ని చదవడంతో పాటుగా ఈ వివరాలను ఎంచుకున్న కాంటాక్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థకు సైతం పంపగలదు.