Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు మొట్టమొదటి ఋణ చెల్లింపు నివేదిక ఫిన్‌టెక్ వేదిక రికార్డెంట్, తమ బృందాన్ని విస్తరించుకోవడంతో పాటుగా ముంబై, హైదరాబాద్‌లలోని కార్యాయాల కోసం కీలకమైన విభాగాలలో ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళిక చేసింది. రికార్డెంట్ అపూర్వమైన విజయాన్ని పలు నూతన క్లయింట్ విజయాన్ని సాధించడం ద్వారా పొందడంతో పాటుగా రాబోయే 10–12 నెలల కాలానికి చక్కటి అభివృద్ధి సాధించగలమనే విశ్వాసంతో ఉంది. ఇది కంపెనీలో నూతన ఉద్యోగావకాశాలనూ తెరువనుంది. రికార్డెంట్ ఇప్పుడు పలు కీలకమైన విభాగాలలో తాజా మరియు అనుభవజ్ఞులైన ఉద్యోగులను నియమించుకోవాలని ప్రణాళిక చేసింది. మరీ ముఖ్యంగా టెక్, డాటా సర్వీస్ టీమ్, డాటా సైంటిస్ట్‌లు, బిజినెస్ ఎనలిస్ట్, డాటా ఇంజినీర్లు, నిపుణులు వంటి విభాగాలలో ఈ నియామకాలను చేపట్టనుంది. ఈ కంపెనీ ప్రధానంగా టియర్ 2, టియర్ 3 నగరాల నుంచి గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. సుప్రసిద్ధ విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలు, ఐఐఎంలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తో పాటుగా నాగ్‌పూర్, మంగళూరు, కాన్పూర్, కోయంబత్తూరు, గౌహతీ వ్యాప్తంగా ఉన్న ఇతర సుప్రసిద్ధ విద్యా సంస్థల నుంచి ఈ నియామకాలు చేపట్టనుంది. ఈ నియామకాలను గురించి రికార్డెంట్ సీఈవొ విన్నీ పాత్రో మాట్లాడుతూ ‘‘అసాధారణ మేధావుల కోసం ఈ సంస్ధ వెదుకుతుంది. సంస్ధ నమ్మకాలు, ఆసక్తులకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ పురోగతికి తోడ్పడే వారిని నియమించుకోవాలనుకుంటున్నాము. మా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యక్తుల నియామకం తమ తొలి ప్రాధాన్యత’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ‘‘రికార్డెంట్ వద్ద, అన్ని స్థాయిల్లోనూ చక్కటి, ఉద్యోగ అనుకూల పని వాతావరణంను ప్రోత్సహిస్తున్నాము. ఉద్యోగి సంక్షేమం, పని–జీవితం సమతుల్యం చేయడాన్ని అమితంగా విశ్వసిస్తుంటాము. మా నూతన ఉద్యోగులు సహకార మరియు సవాల్‌తో కూడిన పని వాతావరణాన్ని ఆశించవచ్చు’’ అని అన్నారు. కోవిడ్ –19 పరిచయం చేసిన లాక్డౌన్స్ సమయంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, రికార్డెంట్ ఓ ప్రభావవంతమైన బృందాన్ని రిమోట్ వర్కింగ్తోనే రూపొందించగలిగింది. ఈ ఫిన్‌టెక్ సంస్ధ 2020లో తమ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటుగా ఏంజెల్ పెట్టుబడులతో నాలుగు లక్షల డాలర్లను ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్, కాంతమనేని ఫ్యామిలీ మరియు ఇండియా,యుఎస్ నుంచి ఏంజెల్ ఇన్వెస్టర్లు నుంచి అందుకుంది.