Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సిద్స్ ఫార్మ్ ఇప్పుడు స్వచ్ఛమైన, తాజా పాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్నమైన సవాల్‌తో ముందుకు వచ్చింది. సిద్స్ ఫార్మ్ యొక్క టాలెంట్ టీమ్ ఇప్పుడు కల్తీ పాల పట్ల ఆప్రమప్తతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్‌లోని పలు స్టోర్స్ వద్ద ప్రతి వారాంతం ప్రత్యక్షంగా పాల పరీక్ష కార్యక్రమాలను వీరు నిర్వహించనున్నారు. గత వారం వీరు ఈ ప్రచారాన్ని విజయవంతంగా హైదరాబాద్‌లోని 24 స్టోర్లు (గ్రోఫర్లు, ఎం మార్ట్, గ్రీన్ లీఫ్ స్టోర్స్ మొదలైనచోట్ల) వ్యాప్తంగా చేయడం ద్వారా స్వచ్ఛమైన పాల పట్ల అవగాహన కల్పించారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం, చిన్నారులతో పాటుగా పెద్దలు యాంటీబయాటిక్స్ వినియోగించినట్లయితే, వారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా అత్యంత ప్రమాదకరమైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్సైతం వచ్చే అవకాశాలున్నాయి. ఈ అవగాహన కార్యక్రమం గురించి డాక్టర్ కిశోర్ ఇందుకూరి, ఫౌండర్ అండ్ ఎండీ, సిద్స్ ఫార్మ్ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు రకాల యాంటీబయాటిక్స్ ను విచక్షణారహితంగా పశువులకు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటి పాల ద్వారా మనుషులకూ అవి చేరి, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిద్స్ ఫార్మ్ వద్ద మేము అవిశ్రాంతంగా మూడు దశలలో యాంటీబయాటిక్స్ అవశేషాల కోసం పాలను ప్రతి రోజూ పరీక్షిస్తుంటాము. ప్రతి శని, ఆది వారాలలో మేము ఈ ప్రచారాన్ని ప్రజల అవగాహన కోసం చేస్తున్నాము. యాంటీబయాటిక్స్ ఉన్న పాల వినియోగం వల్ల కలిగే అనారోగ్యాలు గురించి తెలుపుతూనే స్వచ్ఛమైన పాల వినియోగ ఆవశ్యకతనూ తెలుపుతున్నాము’’ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (గ్రామ్)పై జరిగిన అధ్యయనాల ప్రకారం 1.27 మిలియన్ మరణాలు యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ కారణంగానే జరుగుతున్నాయి. ‘‘మా బృందం స్థిరంగా అత్యున్నత పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం కోసం శ్రమిస్తుంది. ఇప్పుడు మేము 100% హార్మోన్ మరియు యాంటీబయాటిక్ రహిత పాలను విక్రయిస్తున్నామని గర్వంగా చెప్పగలము. ఎంపిక చేసిన స్టోర్ల వద్ద మా వినియోగదారుల కోసం ప్రత్యక్షంగా పాల పరీక్షలను నిర్వహించనున్నాం’’ అని ఆయన జోడించారు.