Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) మార్కెట్లోకి నూతన శ్రేణి ఎ3 పరిమాణపు మోనో మల్టీ ఫంక్షన్ ప్రింటర్ (ఎంఎఫ్పీ) సిరీస్‌ను విడుదల చేసినట్టు ప్రకటించింది. వీటిని సౌకర్యవంతమైన ఫుట్‌ప్రింట్, వైర్లెస్ సామర్ధ్యం, అత్యాధునిక డాటా సెక్యూరిటీ ఫీచర్లతో ఆవిష్కరించినట్టు ఆ కంపెనీ పేర్కొంది. ఎలాంటి కార్యాలయం వాతావరణంలో అయినా ఇమిడి పోవడంతో పాటుగా ప్రింటింగ్ సామర్థ్యం మెరుగుపరచడం, రిమోట్ వర్కింగ్‌కు తోడ్పడటం, వైవిధ్యమైన డాక్యుమెంటేషన్ అవసరాలను తీర్చడం చేయనుందని తెలిపింది. ఇవి 35పీపీఎం, 31పీపీఎం మరియు 28పీపీఎం ప్రింట్ స్పీడ్‌తో అందిస్తుందని పేర్కొంది. వీటి ధరలు రూ.2,46,500 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది.