Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డెంట్ ఫిన్టెక్ వెల్లడి
న్యూఢిల్లీ : తాము కొత్త ఉద్యోగులను తీసుకోనున్నామని రుణ చెల్లింపు వేదిక రికార్డెంట్ తెలిపింది. తమ బృందాన్ని విస్తరించుకోవడంతో పాటుగా ముంబయి, హైదరాబాద్లోని కార్యాలయాల కోసం కీలకమైన విభాగాలలో ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేశామని రికార్డెంట్ సీఈఓ విన్నీ పాత్రో వెల్లడించారు. పలు నూతన క్లయింట్లను పొందడం ద్వారా రాబోయే 10-12 మాసాల్లో మెరుగైన అభివృద్ధి సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కంపెనీలో నూతన ఉద్యోగావకాశాలనూ తెరువనుందన్నారు. కీలకమైన విభాగాలలో కొత్తవారిని అదేవిధంగా అనుభవజ్ఞులైన ఉద్యోగులను నియమించుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు.