Authorization
Mon Jan 19, 2015 06:51 pm
#STEMTheGap కోసం ఉపకరాల వేతనాలు అందించేందుకు గాను భారతదేశ ఎడ్ టెక్ యూనికార్న్ లీడ్ కు నిధులు సమకూరుస్తున్న ఓలే
ముంబై: మగపిల్లలకు వాళ్ల పుట్టిన రోజు నాడు రోబో బొమ్మలు లేదా కన్ స్ట్రక్షన్ సెట్స్ లాంటివి బహుమతిగా ఇస్తే, ఆడపిల్లలకు మాత్రం వారి పుట్టిన రోజున కిచెన్ సెట్స్ ను ఎందుకు బహు మానంగా ఇస్తారు? మనలో దాగిఉన్న జెండర్ వివక్ష అనేది బాలికలను వెనుకనే ఉంచుతోందా ? ఐక్య రాజ్యసమితి నివేదికల ప్రకారం, భారతదేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) సిబ్బందిలో మహిళలు 14శాతం మాత్రమే ఉన్నారు. సైన్స్ బ్రాండ్ గా ఉంటూ, అదే సమయంలో మహిళల బ్రాండ్ గా గర్వి స్తున్న అగ్రగామి చర్మసంరక్షణ బ్రాండ్ అయిన ఓలే, స్టెమ్ కెరీర్స్ లో మరింతగా మహిళలు ప్రపంచానికి అవసరమని విశ్వసిస్తోంది. అంతేగాకుండా స్టెమ్ కోర్సులు చదవడంలో భారతదేశంలో ఉన్న లింగ వివక్ష తీరుతెన్నులను మార్చాల్సిన అవసరం ఉందని కూడా నమ్ముతోంది.
సాంస్కృతికపరమైన అడ్డంకులు, జెండర్ పోషించే పాత్రపై అపోహలు లాంటివాటితో మహిళలు తరచుగా సంరక్షకులుగా, గృహిణులుగానే మిగిలిపోతున్నారు. టీచింగ్, నర్సింగ్, కళలు, ఇంటిని చక్కదిద్దుకోవడం లాంటి వాటికే పరి మితమైపోతున్నారు. అందుకే ఈ బ్రాండ్ మరెంతో మంది భారతీయ విద్యార్థినులు స్టెమ్ కోర్సులు చేసేందుకు, వాటిని కెరీర్ గా ఎంచుకునేందుకు వీలుగా తన #STEMTheGap కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యాచరణలో భాగంగా ఓలే భారతదేశ స్కూల్ ఎడ్ టెక్ అగ్రగామి లీడ్ తో కలసి స్టెమ్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను బాలికల కోసం ప్రవేశపెట్టింది.
లీడ్ సంస్థ 12 లక్షల మందికి పైగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిం చేందుకు గాను 3000కు పైగా పాఠశాలలతో కలసి పని చేస్తోంది. కరిక్యులమ్ డిజైన్ చేయడంలో ఉపా ధ్యాయులకు తోడ్పాటును అందించడం ద్వారా, విద్యార్థులకు ఆయా భావనలను అర్థం చేయించ డంలో మెరుగైన మార్గాల కోసం అన్వేషించడం ద్వారా లీడ్ ఆయా పాఠశాలలను పరివర్తింపజేస్తోంది. పుస్తకాలు, నాణ్యమైన వనరులను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఇతరత్రాగా నాణ్యమైన విద్యను పొందలేని ప్రాంతాల్లో ఓలే స్టెమ్ స్కాలర్ షిప్ కార్యక్రమంలో లీడ్ భాగస్వామిగా మారింది. ఇది బాలికలు తమకు ఆసక్తిగల కోర్సుల్లో తమ చదువును కొనసాగించేందుకు వారికి వీలు కల్పిస్తోంది.
2021 నుంచి కూడా ఓలే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ కింద బాలికలకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తోంది. ట్యాబ్ లు, డేటా ప్యాక్ లు అందిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ట్యాబ్ లు, డేటా ప్యాక్ లు అనేవి కూడా ఎంతో కీలకంగా మారాయి. చాలా కుటుంబాలకు ఇండ్లలో ఉండే పిల్లలకు సరిపడా ట్యాబ్ లు ఉండడం లేదు. అలాంటివి సమకూర్చడం ద్వారా బాలికలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అందించి నట్లయింది. ఆన్ లైన్ తరగతులైనా లేదా భౌతికంగా, డిజిటల్ పరంగా కలగలపి హైబ్రిడ్ వాతావరణంలో తరగతులు నిర్వహించినా ఇవి వారికి ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి.
ఈ సందర్భంగా #STEMTheGap కార్యక్రమం గురించి ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పి అండ్ జి) సీనియర్ వైస్ ప్రె సిడెంట్ (స్కిన్, పర్సనల్ కేర్ ఉ ఏషియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) ప్రియాలి కామత్ మాట్లాడుతూ, 'ఓలే అనేది సైన్స్ లో ప్రగాఢ మూలాలు ఉన్న సంస్థ. మా శాస్త్రవేత్తల్లో 50 శాతం మంది మహిళలే. రోజురోజుకు మరెన్నో ఉద్యోగాలు స్టెమ్ ఆధారితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఉద్యోగాల కోసం బాలికలను సన్నద్ధం చేయడం మనందరి బాధ్యత అని మేం విశ్వసిస్తున్నాం. అందుకే స్టెమ్ లో జెండర్ అంతరం భర్తీ చేసేందుకు సాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. లీడ్ తో కలసి మా స్కాలర్ షిప్ కార్యక్రమం ఇప్పటికే నిజమైన, అర్థవంతమైన మార్పును తీసుకువచ్చింది. భారతదేశంలోని బాలికలకు సానుకూల భవిష్యత్ అందించడంలో భాగం కావడం మాకెంతో ఆనందదాయకం` అని అన్నారు.
లీడ్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమీత్ మెహతా ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఓ లే స్కాలర్ షిప్స్ ఎంతో అర్థవంతమైనవి. బాలికలు తమకు ఇష్టమైన వాటిని చదివేందుకు వారిని సిద్ధం చేస్తాయి. పాఠశాలలను మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న వాటిని పరివర్తింపజేయడం ద్వారా ప్రతి చి న్నారికి కూడా చక్కటి విద్య అందించాలన్నది మా ఆశయం. ఓలేతో మా భాగస్వామ్యం విద్యార్థులకు మ రింతగా తోడ్పడేందుకు, ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారన్న దానితో సంబంధం లేకుండా చదువు ను మరింత ప్రజాస్వామీకరించేందుకు తోడ్పడుతుంది. బాలికలకు తొలినాటి ఏళ్లు పునాదిలా ఉంటాయి. సానుకూల మార్పు తీసుకు వచ్చేందుకు, స్టెమ్ లో లింగ వివక్షను దూరం చేసేందుకు ఈ సదాశయంలో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం` అని అన్నారు.
మహారాష్ట్ర రాయ్ గఢ్ జిల్లా కుచెందిన ఉపకారవేతన గ్రహీత రియా బుటె (9) తండ్రి రంజిత్ బుటె ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'నేను ఒక బస్సు డ్రైవర్ ను. నా కుమార్తె ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. మహమ్మారి సమయంలో మా కుమార్తె పాఠశాల ఫీజులు చెల్లించేందుకు మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
మా కుమార్తె చదువులో వెనుకబడుతుందేమోనని భయపడ్డాం. మా కుమార్తె యావత్ విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించేలా ఓలె చేపట్టిన ఈ కార్యక్రమం గురించి లీడ్ మాకు పరిచయం చేసింది. దాంతో మేమెంత గానో సంతోషించాం. ఒత్తిళ్లకు గురవుతున్న సమయంలో ఈ విధమైన భారీ సహాయం అందించినందుకు గాను ఓలెకు మరియు లీడ్ కు మేమెన్నటికీ రుణపడి ఉంటాం` అని అన్నారు.
#STEMTheGap వంటి అర్థవంతమైన కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్టెమ్ లో ఉన్న జెండర్ అంతరానికి ముగింపు పలికేందుకు ఓలే కట్టుబడి ఉంది. మనలో అనాలోచితంగానే ఉంటున్న ధోరణి స్టెమ్ కోర్సులు అనేవి బాలికలకు కాదు అనే విషయాన్ని ఎలా బయటకు తెస్తుందన్నఅంశాన్ని బలంగా కనిపించేలా ఫిల్మ్ ను ఈ బ్రాండ్ తీసుకువచ్చింది. #STEMTheGap కోసం మనమంతా కలసికట్టుగా పని చేసేందుకు పిలుపునిచ్చింది.
Link to the film: https://www.youtube.com/watch?v=Dz0AA0O6MmU
ఓలే ఇండియా గురించి:
ఓలా అనేది చర్మసంరక్షణలో అంతర్జాతీయ అగ్రగామి. 60 ఏండ్లకు పైగా ఇది మహిళల విశ్వాసాన్ని చూర గొంటూ వ స్తున్నది. మహిళల మారుతున్న అవసరాల గురించి ఓలే ఎంతగానో అర్థం చేసుకుంటూ వోస్తోం ది. వాటిని తీర్చేం దుకు అత్యున్నత సైన్స్ ఆధారంగా ఉత్పాదనలను అందిస్తోంది. సంచలనాత్మక దిను సులు, ఫార్ములేషన్స్ ఉప యోగిస్తూ, నిరూపిత పనితీరు టెస్టింగ్ తో ఓలే ఎన్నో రకాల ఉత్పాదనలను అందిస్తోంది. అవన్నీ కూడా యవ్వనం తో చర్మం కనిపించేలా చేసేందుకు కణాల స్థాయిలో పనిచేసేలా, చర్మ అనారోగ్యాలకు సంబంధించిన వాటిపై మూలాలపై పని చేసేలా అవి రూపుదిద్దుకున్నాయి. ఐదు ఖం డాల్లో 80 మిలియన్ల మంది మహిళలకు వారు ఆరోగ్యంగా, అందమైన చర్మంతో కనిపించేలా చేస్తున్న నేప థ్యంలో ఓలె నుంచి మహిళా వినియోగదారులు అత్యున్నత స్థాయి పనితీరును కోరుకుంటూ ఉంటారు.
సైన్స్ లో మూలాలు ఉన్న సంస్థగా ఓలే ఇండియా స్టెమ్ లో లింగ సమానత్వం కోసం కృషి చేస్తోంది. భారతదేశంలో #STEMTheGap కు తోడ్పడేందుకు, బాలికలు స్టెమ్ కోర్సులు చదివేలా వారిని ప్రోత్సహించేందుకు ఓలె కట్టుబడి ఉంది. లీడ్ స్కూల్ తో కలసి దేశంలో బాలికలకు స్టెమ్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది.
ఇంకా సమాచారం కోసం https://pgshop.in/brand-olay/ ను సంప్రదించొచ్చు
ప్రొక్టెర్ అండ్ గాంబుల్ (పి అండ్ జి) గురించి:
పి అండ్ జి భారతదేశంలోని వినియోగదారులకు విశ్వసనీయమైన, నాణ్యమైన, నాయకత్వస్థానంతో కూ డుకున్న బ్రాండ్లతో తన సేవలను అందిస్తోంది. Pantene®, Head & Shoulders®, Herbal Essences®, Vicks ®, Ariel®, Tide®, Whisper®, Olay®, Gillette®, AmbiPur®, Pampers®, Oral-B®, and Old Spice® లాంటివి వీటిలో ఉ న్నాయి.
లీడ్ గురించి:
లీడ్ అనేది భారతదేశంలో స్కూల్ ఎడ్ టెక్ విభాగంలో అగ్రగామి సంస్థ. భారతదేశంలో పాఠశాల విద్యను పరివర్తింపజేయడం ఆశయం గా గలసుమీత్ యశ్ పాల్ మెహతా, స్మితా దియోరా దీన్ని ప్రమోట్ చేశారు. ఇది సాంకేతికత, కరిక్యులమ్ తదితరాలను బోధన, అభ్యసనం వ్యవస్థలో సమ్మిళితం చేస్తుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను, ఉపాధ్యాయుల బోధన తీరును మెరుగుపరుస్తుంది. లీడ్ వినూత్నత, అత్యంత ప్రభావపూరిత ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ సిస్టమ్ పాఠశాలల, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పాత్రను గణనీయంగా బలోపేతం చేస్తోంది. తద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ చిన్నారుల సమగ్ర ఉన్నతికి తోడ్పడుతోంది.