Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు సుప్రసిద్ధ సైన్స్ ఆధారిత నిపుణుడు డాబర్ ఇండియా లిమిటెడ్ నేడు దక్షిణాది సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జునను బ్రాండ్ అంబాసిడర్‌గా తమ ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ డాబర్ చ్యావన్‌ప్రాష్ కోసం ఎంచుకుంది.
ఈ నూతన యాడ్ ప్రచారాన్ని ప్రత్యేకంగా దక్షిణ భారత మార్కెట్ల కోసం అక్కినేని నాగార్జునతో తీర్చిదిద్దారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, కేరళలలో ప్రసారం చేయనున్నారు. ఈ భాగస్వామ్యంతో డాబర్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంటికీ చేరుకోవడంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, అనారోగ్యంతో పోరాడటంలో డాబర్ చ్యావన్‌ప్రాష్ పోషించే పాత్రను వెల్లడిస్తుంది.
‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్ల కోసం మా బ్రాండ్ ప్రచార ముఖచిత్రంగా సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున మా బోర్డ్‌పైకి రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. దాతృత్వకారిగా మాత్రమే గాక హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా నాగార్జున పలు కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో సైతం కనిపించారు. అదే రీతిలో డాబర్ చ్యావన్ ప్రాష్కు కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. దాదాపు 40 వనమూలికలు అయినటువంటి అశ్వగంధ, జిలోయ్, ఆమ్లా వంటివి దీనిలో ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటుగా అనారోగ్యంతో పోరాడటంలోనూ తోడ్పడతాయి. సూపర్ స్టార్ నాగార్జునను మా డాబర్ కుటుంబంలోనికి ఆహ్వానించడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని డాబర్ ఇండియా లిమిటెడ్ రీజనల్ బిజినెస్ హెడ్ –సౌత్, జెపీ విక్టోరియా అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘ డాబర్ కుటుంబంతో భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉన్నాను. తమ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి డాబర్ చ్యావన్ప్రాష్ను భాగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రోగ నిరోధక శక్తికి గతానికన్నా ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. బలమైన రోగ నిరోధక శక్తి పొందడం ఇప్పుడు తక్షణావసరంగా మారింది. ఓ వినియోగదారునిగా ఎంతోకాలంగా నేను డాబర్‌తో అనుబంధం కలిగి ఉన్నాను. ఈ ప్రచారం ద్వారా ప్రతి ఇంటికీ డాబర్ చ్యావన్ ప్రాష్ తీసుకువెళ్లగలనని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
‘‘ఈ ప్రచార చిత్రం కోసం మేము సిలాంబమ్ లేదా కర్రసామును నేపథ్యంగా తీసుకున్నాం. మా చిత్రం యాక్షన్‌తో కూడి ఉండటంతో పాటుగా డాబర్ చ్యావన్ ప్రాష్ మీకు ఏ విధంగా శక్తిని అందిస్తుందన్నది తెలుపుతుంది’’అని మెక్కాన్ వరల్డ్ గ్రూప్ క్రియేటివ్ హెడ్ – సౌత్ సంబిత్ మోహంతీ అన్నారు.