Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వాట్సప్ నేడు ప్రజలకు ఆన్లైన్లో సురక్షత, స్మార్ట్ మరియు భద్రతతో ఉండేందుకు మద్దతుగా ప్రత్యేకమైన సురక్షత చర్యలు మరియు ప్రక్రియలపై అవగాహన కల్పించే 'సేఫ్టీ ఇన్ ఇండియా` రిసోర్స్ హబ్‌ను ప్రారంభించింది. ఈ రిసోర్స్ హబ్‌ను ప్రారంభించడం ద్వారా వాట్సప్‌లో ఇంటర్నెట్ వినియోగపు సురక్షతను ఉత్తేజించేలా, వారం మొత్తం నిర్వహించిన చటేక్ఛార్జ్ క్యాంపెయిన్ తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రిసోర్స్ హబ్ ఆన్లైన్ సురక్షత, గోప్యత మరియు భద్రత చుట్టూ ఉన్న పలు ప్రముఖ విషయాలను అన్వేషిస్తుంది మరియు సాధారణంగా ఎదురయ్యే పలు అపోహలను నివారించడమే కాకుండా, దీనితో వినియోగదారులను నేటి డిజిటల్లీ అనుసంధానమై ఉండే ప్రపంచంలో సంభవనీయమైన సైబర్ కుంభకోణాల నుంచి రక్షణ పొందవచ్చనే జాగృతి కల్పిస్తుంది.
https://faq.whatsapp.com/general/safety-in-india/?lang=en
సేఫ్టీ ఇన్ ఇండియా హబ్ ద్వారా వాట్పప్ లక్ష్యం వివిధ సురక్షత చర్యల గురించి జాగృతిని కల్పించడం మరియు వినియోగదారులను ఈ సేవలను వినియోగించుకుని వారి సురక్షతను నియంత్రణలోకి తీసుకునేందుకు తయారుగా ఉంచుతూ, ఇన్-బిల్ట్ ఉత్పత్తి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ రిసోర్స్ హబ్ వాట్సప్ అలవర్చుకునే మెరుగైన సాంకేతికతను కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అది తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు అలాగే ఈ ప్లాట్ఫారంలో ఇతర దుర్వినియోగాలను తప్పించేందుకు సహకరిస్తుంది.
సేఫ్టీ ఇన్ ఇండియా రిసోర్స్ హబ్ ప్రారంభం గురించి వాట్సప్ భారతదేశపు ప్రధాన అధికారి అభిజిత్ బోస్ మాట్లాడుతూ, 'మా వినియోగదారుల సురక్షతను మేము వాట్సప్‌ను వినియోగించే ప్రతి ఒక్కరికి కేంద్రంగా చేసుకున్నాము మరియు ప్రత్యేకంగా 'సేఫ్టీ ఇన్ ఇండియా` రిసోర్స్ హబ్ ప్రారంభంతో వినియోగదారులకు వారి ఆన్లైన్ సురక్షతను నియంత్రణలోకి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. పలు సంవత్సరాల నుంచి మేము వినియోగదారులకు భద్రత మరియు గోప్యతను వృద్ధి చేసేందుకు గమనార్హమైన ఉత్పత్తి మార్పులను చేశాము. వినియోగదారుల సురక్షతకు నిరంతరం ఉత్పత్తి ఆవిష్కారాలే కాకుండా మేము వరుసగా అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డేటా సైంటిస్టులు, నిపుణులు మరియు ఇన్ ప్రాసెస్‌లలో పెట్టుబడి పెడుతున్నాము. ఈ వనరులు వినియోగదారులకు వారి గోప్యతను రక్షించుకునేందుకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్ను సురక్షితంగా వినియోగించుకునేందుకు సహకరిస్తుందన్న భరోసా మాకు ఉంది` అని తెలిపారు.
ఎండ్-టు- ఎండ్ ఎన్‌క్రిప్ట్‌డ్ మెసేజింగ్ సేవల వ్యాపారంలో అగ్రగామి కంపెనీగా వాట్సప్ తన వినియోగదారుల సురక్షతను వరుసగా ఉత్పత్తి ఆవిష్కారాల్లో చేయడం ద్వారా వినియోగదారులు సురక్షితంగా ఉండేందుకు ఆన్లైన్లో ఉత్తమ అలవాట్లను జాగృతిని కల్పిస్తుంది.