Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా మార్కెట్లోకి కొత్త స్ప్లిట్ రూమ్ ఎసిలను విడుదల చేసినట్టు ప్రకటించింది. ఆధునిక టెక్నలాజీ, అత్యంత నాణ్యతతో ఈ నూతన 'యు' సిరీస్ ఉత్పత్తులను ఆవిష్కరించామని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజరు గోయల్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇవి మరో 15 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయన్నారు. వైఫైతోనూ పని చేసే వీటి ధరలు రూ.25వేల నుంచి రూ.60వేల వరకు ఉంటుందన్నారు. దేశంలో తమ మూడో ప్లాంట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేయడానికి ఇటీవలే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. తొలుత ఏడాదికి 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థం కలిగిన ఈ ప్లాంట్ కోసం రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు.