Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మార్కెట్లోకి కొత్త ప్రీమియం హ్యాచ్ బ్యాక్‌లో ''న్యూ ఏజ్ బాలెనో''ను విడుదల చేసింది. దీని ధరల శ్రేణీ రూ.6.35 లక్షల నుంచి రూ.9.49 లక్షలుగా ప్రకటించింది. ఇది లీటర్‌కు 22.35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆ కంపెనీ తెలిపింది.ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభమైనట్లు పేర్కొంది. దీనిని తయారుచేసేందుకు కంపెనీ రూ.1,150 కోట్లు పెట్టుబడి పెట్టిందని వెల్లడించింది. అత్యున్నతమైన ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ ఫీచర్లతో ఆవిష్కరించినట్లు పేర్కొంది