Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ వ్యవస్థాపకుల వెల్లడి
హైదరాబాద్ : టీ, కాఫీ రిటైల్ స్టోర్ల నిర్వహణ సంస్థ డికాక్షన్ 100 కేంద్రాల మైలురాయిని అధిగమించి నట్టు సంస్థ ప్రకటించింది. ఏడాదిన్నర కాలంలోనే తాము ఈ ఘనతను సాధించామని డికాక్షన్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ వ్యవస్థాపకులు అద్దేపల్లి సంతోషి, జయ కిరణ్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఖాతాలో 110 కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందులో ఒక్కటి మాత్రమే తమ సొంతమని.. మిగితావన్నీ ఫ్రాంచైజీలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 నగరాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 70 కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో 20 స్టోర్ల ఏర్పాటు కోసం ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ నాటికి 130 ఔట్లెట్లు దాటొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నాటకలోనూ ఏర్పాటు చేయడానికి ఎంక్వైరీలు వస్తున్నాయన్నారు.