Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ శాంసంగ్ నేడు తమ విప్లవాత్మక 2022 జాబితా ప్రీమియం విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్లను విడుదల చేసింది. ఇవి ఉక్కబోత వాతావరణంతో కూడిన గదులను శక్తివంతంగా, మృదువుగా చల్లబరుస్తాయి. విండ్–ఫ్రీ సాంకేతికత అత్యంత కఠినమైన శీతగాలులు రాకుండా అడ్డుకోవడంతో పాటుగా 23,000 సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని ప్రసరింపజేస్తాయి. ఈ రంధ్రాలు 0.15 మీటర్/సెకన్ వేగంతో విస్తరించడం వల్ల గాలి ఆగిన వాతావరణం సృష్టిస్తుంది. సౌకర్యవంతమైన కూలింగ్ కోసం ఖచ్చితమైన పరిష్కారంగా ఉండటంతో పాటుగా ఈ వేసవిలో మీ తరువాత ఏసీ ఆధునీకరణగా కూడా నిలుస్తుంది. ఈ నూతన శ్రేణి ఏసీలు పీఎం 1.0 ఫిల్టర్లుతో వస్తాయి. ఇది 99% వరకూ బ్యాక్టీరియాను స్టెరిలైజ్ చేయడంతో పాటుగా ఫ్రీజ్ వాష్ ఫీచర్‌తో మురికి మరియు బ్యాక్టీరియాను హీట్ ఎక్సేంజర్ నుంచి తొలగిస్తుంది. అతి సులభంగా మీ అంతట మీరే ఇంటిలో దీనిని నిర్వహించుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ నూతన శ్రేణి మీ లివింగ్ స్పేస్ లేదా వర్క్ స్పేస్‌ను సైతం ఆహ్లాదంగా మారుస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ తరపు జీవితాలకు మరింత సౌకర్యం జోడించే విండ్ ఫ్రీ ఏసీలు అత్యంత సౌకర్యంగా శాంసంగ్ యొక్క స్మార్ట్ థింగ్స్ యాప్‌తో వై–ఫై వినియోగించడం ద్వారా మిళితమవుతుంది. ఇది మీరు సెట్టింగ్స్ మార్చేందుకు లేదా ఆన్ /ఆఫ్ బటన్స్ స్విచ్ చేయడానికి తోడ్పడుతుంది. దీనిలో బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్, అలెక్సా మరియు గుగూల్ హోమ్ మద్దతు కూడా ఉంది. మీరు కూలింగ్‌ను స్మార్ట్ ఏఐ ఆటో కూలింగ్‌తో పాటుగా గరిష్టంగా ఉంచుకోవచ్చు. ఇది స్వయంచాలకంగా గదిని మీరు లోపలకు ప్రవేశించే లోపుగానే చల్లబరుస్తుంది. దీనిలోని జియో–ఫెన్సింగ్ ఆధారిత వెల్కమ్ కూలింగ్ ఫీచర్ దీనికి తోడ్పడుతుంది. అంతేకాదు, విండ్‌ఫ్రీ టెక్నాలజీ తో 77% వరకూ విద్యుత్‌ను ఆదా చేయవచ్చు మరియు దీనిలోని 5–ఇన్–1 ఏసీలలో ఉన్న డిజిటల్ ఇన్వర్టర్ సాంకేతికతతో 41% వరకూ విద్యుత్ ఆదా చేయవచ్చు. శాంసంగ్ యొక్క నూతన శ్రేణి విండ్‌ఫ్రీ ఏసీలు అన్ని సుప్రసిద్ధ రిటైల్ స్టోర్లు మరియు ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌పై అలాగే శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభ్యమవుతాయి. శాంసంగ్ ఎయిర్కండీషనర్లను కొనుగోలు చేసే వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు అయినటువంటి 12.5% క్యాష్‌బ్యాక్‌తో 7500 రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్, అతి సులభమైన ఈఎంఐ అవకాశాలు. ఈఎంఐలు అతి తక్కువగా 999 రూపాయలతో ప్రారంభం మరియు అదనపు సమగ్రమైన వారెంటీ 5 సంవత్సరాలు పొందవచ్చు.
‘‘మా తాజా శ్రేణి ప్రీమియం విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్లు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి గాలిని 23వేల సూక్ష్మ రంధ్రాల ద్వారా పంపిణీ చేస్తాయి. ఇవి అత్యున్నత స్థాయి సౌకర్యం అందించడంతో పాటుగా స్టిల్ ఎయిర్ వాతావరణం సృష్టిస్తాయి. దీనితో పాటుగా శక్తివంతమైన కూలింగ్‌ను సైతం అందిస్తాయి. ఈ నూతన శ్రేణిని సరైన ఉష్ణోగ్రతలు నిర్వహించడంతో పాటుగా మా వినియోగదారుల రోజువారీ అవసరాలను తీర్చే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. విండ్‌ఫ్రీ ఏసీ అతి తక్కువ శబ్దం 21 డెసిబల్స్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. అందువల్ల పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో ఇది పనిచేస్తుంది. విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్లలోని స్మార్ట్ ఏఐ ఫీచర్లుతో వినియోగదారులు రిమోట్‌గా నిర్వహించేందుకు అనుమతిస్తుంది. దీనిలోని కన్వర్టబల్ అవకాశాలు తెలివిగా విద్యుత్ వినియోగం చేస్తాయి.ఈ శ్రేణి వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడంతో పాటుగా భారతీయ ఏసీ మార్కెట్లో మా స్ధానాన్ని మరింత బలోపేతం చేయనుందని ఆశిస్తున్నాము’’ అని రాజీవ్ భుటానీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెచ్‌వీఏసీ డివిజన్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
అత్యంత సౌకర్యవంతంగా విడదీయకలిగిన మరియు అతి సులభంగా శుభ్రంగా చేయగలిగిన ఫిల్టర్+ను విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్స్ పై భాగంలో ఏర్పాటుచేశారు. దీనివల్ల వినియోగదారులు తమంతట తాముగా తొలగించి శుభ్రపరుచుకోవచ్చు. బ్యాక్టీరియా, అలెర్జిన్స్ మరియు వైరస్ల నుంచి అదనపు భద్రతను జోడిస్తుంది. ఎంపిక చేసిన మోడల్స్‌లో ట్రై–కేర్ ఫిల్టర్ కూడా ఉంది.
ఒకవేళ గదిలో 20 నిమిషాల పాటు ఎలాంటి కదలికలూ లేకపోతే మోషన్ డిటెక్ట్ సెన్సార్ స్వయంచాలకంగా మీ ఏసీని విండ్ ఫ్రీ మోడ్‌గా మార్చి శక్తిని ఆదా చేస్తుంది. మీరు గాలిని మీ నుంచి దూరంగా నెట్టివేయడం లేదా మీరు ఎక్కడ ఉంటే అక్కడకు తీసుకువెళ్తుంది.
ధర, లభ్యత మరియు వారెంటీ
ఈ నూతన శ్రేణి శాంసంగ్ ప్రీమియం విండ్ ఫ్రీ ఎయిర్ కండీషర్స్ 28 మోడల్స్‌తో వస్తాయి. వీటి ధరలు 50,990 రూపాయల నుంచి 99,990 రూపాయల ధరలో ఉంటాయి. వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు అయినటువంటి 12.5% క్యాష్‌బ్యాక్‌ను 7500 రూపాయల వరకూ పొందవచ్చు . అతి సులభమైన ఈఎంఐ అవకాశాలు సైతం వీటితో పాటుగా లభిస్తాయి. ఇది 999 రూపాయల నుంచి ఉంటుంది.ఈ ఏసీలు పీసీబీ కంట్రోలర్, ఫ్యాన్ మోటర్, కాపర్ కండెన్సర్ మరియు ఎవాపరేటర్ కాయిల్‌పై ఐదు సంవత్సరాల సమగ్రమైన వారెంటీతో వస్తాయి.
విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్లను కొనుగోలు చేసిన వినియోగదారులు నాలుగు గంటలలో ఇన్స్టాలేషన్ సేవలను పొందవచ్చు. ఈ నూతన శ్రేణి స్మార్ట్ ఇన్స్టాలేషన్ అవకాశంతో వస్తుంది. దీనిలో సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫీచర్ ఉంది. ఇది ఈ శాంసంగ్ ఏసీ ఖచ్చితంగా ఇన్స్టాల్ అయిందనే భరోసా అందిస్తుంది. వినియోగదారులు 10 సంవత్సరాల వారెంటీని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్‌పై పొందగలరు. ఇది 52 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ చల్లదనంకు భరోసా అందిస్తుంది.
శాంసంగ్ ఇప్పుడు 48 ఇతర మోడల్స్ కూడా విడుదల చేసింది. వీటిలో 44 మోడల్స్ కన్వర్టబల్ 5–ఇన్–1 శ్రేణిలో ఉండగా, నాలుగు ఫిక్స్డ్ స్పీడ్ మోడల్స్ ఎయిర్ కండీషనర్స్. ఈ మోడల్స్ 45,990 రూపాయల నుంచి 77,990 రూపాయల శ్రేణిలో ఉంటాయి. అంతేకాదు, వినియోగదారులు 15 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పథకాలను ఎంపిక చేసిన మోడల్స్‌పై పొందగలరు. వినియోగదారులు ఇప్పుడు అత్యాధునిక విండ్ ఫ్రీ ఏసీలను నేరుగా శాంసంగ్ నుంచి https://www.samsung.com/in/air-conditioners/wind-free-ac/ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
శక్తివంతమైనప్పటికీ మృదువైనది
శాంసంగ్ విండ్ ఫ్రీ ఏసీలు 23వేల మైక్రో హోల్స్‌ను తమ శరీరంపై కలిగి ఉంటాయి. ఇవి అత్యంత మృదువుగా గాలిని గది అంతటా విస్తరించడంతో పాటుగా సౌకర్యవంతమైన స్థాయిలో చల్లదనంను ప్రత్యక్షంగా ఎలాంటి డ్రాఫ్ట్ లేకుండా అందిస్తుంది. ఒకసారి కోరుకున్న ఉష్ణోగ్రత చేరుకుంటే వినియోగదారులు విండ్ ఫ్రీ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయవచ్చు. ఇది స్టిల్ ఎయిర్ వాతావరణాన్ని మృదువైన కూలింగ్ కోసం అందిస్తుంది.
స్మార్ట్ వినియోగదారుల కోసం స్మార్ట్ కంట్రోల్
విండ్ ఫ్రీ శ్రేణి ఎయిర్ కండీషనర్లుతో వినియోగదారులు బిక్స్బీ, అలెక్సా, గుగూల్ హోమ్‌లను వై–ఫై ద్వారా వినియోగించి తమ గొంతుతోనే ఏసీ నిర్వహించవచ్చు. స్మార్ట్ థింగ్స్ యాప్‌తో మీరు మీ ఏసీని రిమోట్‌గా ఆన్ చేయవచ్చు మరియు మీ అభిమాన సెట్టింగ్స్‌ను సైతం చేయవచ్చు. అందువల్ల మీరు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితమైన స్వాగతం కూడా పొందగలరు.
ఏఐ ఆటో కూలింగ్ ఫీచర్ స్వయం చాలకంగా కూలింగ్‌ను మీ వినియోగ ప్రవర్తన మరియు జీవన పరిస్ధితులకు అనుగుణంగా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇది స్వయం చాలకంగా తగిన కూలింగ్ మోడ్‌కు స్విచ్ కావడంతో పాటుగా ప్రాధాన్యతా ఉష్ణోగ్రతలు మరియు బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దీనిని మార్చుకోవడమూ చేస్తుంది.
మెరుగైన ఇంధన సామర్థ్యం
విండ్‌ఫ్రీ శ్రేణి ఎయిర్ కండీషనర్లు తో వినియోగదారులు ఐదు మార్చుకోతగిన విధానాల నుంచి రిమోట్ కంట్రోల్ పై ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా ఎంచుకోవచ్చు. ఇవి అనుకూలీకరణ ఏసీ పనితీరు అవకాశాలను అందిస్తాయి. ఇది 40% నుంచి 120% వరకూ ఉంటుంది.దీని కస్టమైజ్డ్ సెట్టింగ్స్‌లో పార్టీ మోడ్ (120%), సాధారణ మోడ్ (100%), ఆహ్లాదకరమైన మోడ్ (80%), ఎకో మోడ్ (60%) మరియు హోమ్ ఎలోన్ మోడ్ (40%) ఉన్నాయి. ఇవి గరిష్ట గది ఉష్ణోగ్రతను మీ అవసరాలకనుగుణంగా మాన్యువల్ గా ఏసీలను నియంత్రంచే కష్టాలు లేకుండా అందిస్తుంది. అదనంగా, డిజిటల్ ఇన్వర్టర్ బూస్ట్, వినియోగదారులు 41% విద్యుత్‌ను ఆదా చేసేందుకు తోడ్పడనుంది. అంతేకాదు, తరచుగా ఏసీని ఆన్ లేదా ఆఫ్ చేయకుండా కోరుకున్న ఉష్ణోగ్రతలను పొందవచ్చు.
శాంసంగ్ ఇప్పుడు ఇంధన పరంగా అత్యుత్తమ పొదుపును అందించే 3స్టార్ నుంచి 5 స్టార్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను అందిస్తుంది. ఇది వారి విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించి విండ్ ఫ్రీ సాంకేతికతతో 77% వరకూ విద్యుత్ ఆదా చేసే అవకాశం అందిస్తుంది.
విండ్ ఫ్రీ లోని గుడ్ స్లీప్ మోడ్ ,అత్యంత అనుకూలమైన గది వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఆహ్లాదకరం కాని ఎయిర్‌ఫ్లో లేకుండా చేసి సాధారణ కూలింగ్ మోడ్స్‌తో పోలిస్తే 77% విద్యుత్‌ను ఆదా చేస్తుంది. 2022 శాంసంగ్ ఇన్వర్టర్ ఏసీలు పర్యావరణ అనుకూల ఆర్ 32 గ్యాస్ కలిగి ఉండటంతో పాటుగా కాపర్ కండెన్సర్లతో సమృద్ధి కలిగి ఉంటాయి.
శాంసంగ్ కాపర్ కండెన్సర్లు కాపర్ ట్యూబ్‌తో తయారు చేయబడతాయి. ఇవి తుప్పు పట్టవు మరియు కండెన్సర్‌ను తుప్పు పట్టనీయకుండా కాపాడతాయి. హీట్ ఎక్సేంజర్ గరిష్ట పనితీరు నిర్వహించడంలో ఇవి సహాయపడతాయి.
మోషన్ డిటెక్ట్సెన్సార్లుతో కూడిన ఈ ఎయిర్ కండీషనర్లు స్వయంచాలకంగా విద్యుత్ పొదుపు మోడ్‌లోకి ఓ 20 నిమిషాలు గదిలో ఎలాంటి కదలికలూ లేని ఎడల మారిపోతుంది. తద్వారా 43% విద్యుత్ పొదుపు చేయబడుతుంది. వీటినిలోని మోషన్ డిటెక్ట్ సెన్సార్లు రెండు మోడ్స్ – డైరెక్ట్ విండ్ (ఇది కదలికలు ట్రాక్ చేయడంతో పాటుగా గాలిని అందుకు తగినట్లుగానే పంపుతుంది) మరియు ఇన్‌డైరెక్ట్ మోడ్ (ఇది కదలికలను గుర్తించి ఆ వ్యక్తిని నేరుగా గాలితగలకుండా కదలికలను కనుగొంటుంది)
దాదాపు 20 నిమిషాల పాటు మానవ కదలికలను గదిలో ఏసీ గుర్తించని ఎడల విండ్ ఫీర మోడ్ యాక్టివేట్ కావడంతో పాటుగా ఉష్ణోగ్రతను 28 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ తగ్గిస్తుంది. కానీ గదిలో యాక్టివిటీ గమనించిన తరువాత గత కార్యకాలాపాలు పునరుద్ధరింబడతాయి.
శాంసంగ్ ఏసీలతో ఆరోగ్యవంతమైన జీవనం
శాంసంగ్ ప్రయత్నమెప్పుడూ కూడా స్ధిరంగా వినియోగదారులకు సౌకర్యం మరియు ఆరోగ్యం అందించే ఉత్పత్తులను రూపొందించడం. ఈ ఆలోచనతోనే, ఈ నూతన శ్రేణి విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్లు పలు రకాల ఫిల్టర్లతో వస్తున్నాయి. ఇవి స్వచ్ఛమైన మరియు శ్వాసించతగిన గాలిని అందిస్తాయి.
శాంసంగ్ యొక్క విండ్ ఫ్రీ ఏసీలు పీఎం 1.0 ఫిల్టర్లతో వస్తాయి. ఇవి స్వచ్ఛమైన, శ్వాసించతగిన గాలిని అలా్ట్ర–ఫైన్ డస్ట్‌ను సైతం ఒడిసి పట్టుకుని అందిస్తుంది. దీనితో పాటుగా బ్యాక్టీరియా మరియు వైరస్‌ను సైతం నిర్వీర్యం చేస్తుంది. ఈ పీఎం 1.0 ఫిల్టర్ ఉతకడానికి అనువైనది మరియు పునర్వినియోగించతగినది. ఇది అత్యంత అనుకూలమైన ధరలో లభ్యమవుతుంది.
ఈ విండ్‌ఫ్రీ శ్రేణి ఎయిర్ కండీషనర్లలో ట్రై కేర్ ఫిల్టర్ ఉంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, అలెర్జీ కారకాలకు అడ్డుకుంటుంది.
గాలి నాణ్యతను లేజర్ సెన్సార్ ద్వారా పరీక్షించడం జరుగుతుంది. దీనితో వినియోగదారులు డిజిటల్ 4 కలర్ అరోరా లైటెనింగ్ద్వారా చూడవచ్చు. దీనిలో రెడ్ అతి తక్కువ స్ధాయి చూపితే, పసుపు రంగు తక్కువ స్థాయిని, ఆకుపచ్చ సాధారణ స్ధాయిని , నీలి రంగు మంచి గాలి నాణ్యతను సూచిస్తుంది. ఏఐ ఫ్యూరిఫికేషన్ ఫంక్షన్ ద్వారా ఈ వినూత్నమైన ఫిల్టర్ తనంతట తానుగా శుభ్రపరుచుకోగలదు.
శాంసంగ్ ఎయిర్ కండీషనర్లతో అతి సులభమైన నిర్వహణ మరియు సౌకర్యం
కాంటాక్ట్‌లెస్ సేవలకు ఆదరణ పెరుగుతుండటం చేత ఈ ఎయిర్ కండీషనర్లు ఫ్రీజ్ వాష్ ఫీచర్‌ను అందిస్తాయి. ఇది మురికి మరియు 90%బ్యాక్టీరియాను హీట్ ఎక్సేంజర్ నుంచి తొలగిస్తుంది. తద్వారా ఇంటి వద్దనే మీరు స్వయంగా దీనిని నిర్వహించుకోవడం వీలవుతుంది. సర్వీస్‌మెన్‌ను ఇంటికి పిలిపించే అవకాశామూ తప్పుతుంది.
శాంసంగ్ విండ్ ఫ్రీ ఏసీలు ఈజీ ఫిల్టర్ + సాంకేతికతతో వస్తాయి. స్వీయ సేవా అవకాశం ఇది. దీనితో వినియోగదారులు వేగంగా ఇంటి వద్దనే ఫిల్టర్లను తొలగించి శుభ్ర పరుచుకోవచ్చు. ఈ ఫిల్టర్లు ఎయిర్‌కండీషనర్ల పై భాగంలో ఉండటం వల్ల అతి సులభంగా వీటిని తొలగించడంతో పాటుగా శుభ్రపరుచుకోవడమూ చేయవచ్చు. ఈ ఈజీఫిల్టర్+ దాదాపు 99% ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అదనంగా దుమ్ము, జంతువుల జుట్టు, ఫైబర్ మరియు ఇంటిలోపలి ధూళిని సైతం ఒడిసిపడుతుంది.
ఈ ఎయిర్ కండీషనర్లు గదిని అతి తక్కువ శబ్దంతో చల్లబరుస్తాయి. విండ్‌ఫ్రీ మోడ్‌లో ఈ ఏసీలు కేవలం 21 డెసిబల్స్ శబ్దం మాత్రమే విడుదల చేస్తాయి. లైబ్రరీలో ఉన్నప్పుడు ఉండే శబ్దం కంటే ఇది తక్కువ.
ఇంటర్‌టెక్ చేత పరీక్షించబడినది
ఇంటర్‌టెక్ చేత పరీక్షించబడినది. ఫ్రీజ్ వాష్ ఫీచర్ లేనటువంటి సాధారణ మోడల్స్‌తో పోలిస్తే దాదాపుగా 90%కు పైగా స్టాఫిలోకాకస్ అరియస్ ఏటీసీసీ 6538 మరియు ఎస్చెర్చియా కోలీ ఏటీసీసీ 8739 బ్యాక్టీరియాను హీట్ ఎక్సేంజ్ పై నుంచి తొలగిస్తుంది.