Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమ్మమ్మాస్ బ్రాండ్ పేరుతో ఈజీ టు కుక్ ఉత్పత్తుల తయారీలో ఉన్న మంగమ్మ ఫుడ్స్ తాజాగా రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. మార్చిలోగా ఎనమిది ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో రెండు కేంద్రాలున్నాయని పేర్కొంది. 2023 చివరినాటికి 100 స్టోర్ల స్థాయికి చేరుస్తామని మంగమ్మ ఫుడ్స్ సహ వ్యవస్థాపకులు ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. పచ్చళ్లు, తణధాన్యాలు, స్వీట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి 100 రకాల ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నామని, 10 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నామన్నారు.