Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రష్యా- ఉక్రెయిన్ పరిణామాలతో బంగారం ధర ఒక్క సారిగా భగ్గుమంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. గురువారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పది గ్రాములపై పసిడి ధర రూ.2,250 ఎగిసి రూ.52,630కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లకు చేరుకుంది. గడిచిన 13 మాసాల్లో ఇదే గరిష్టం. ఇది 2000 డాలర్లకు కూడా చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చెన్నరులో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,270 నుంచి రూ.52,660కి చేరింది. న్యూఢిల్లీలో ఇది రూ.46,850 నుంచి రూ.51,110కి పెరిగింది. కిలో వెండి ధర రూ.2300 పైగా ప్రియమై రూ.66,501కి చేరింది.