Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతి పెద్దదైన, ధైర్యవంతమైన, పూర్తి వైవిధ్యమైన టాబ్లెట్
హైదరాబాద్ : శాంసంగ్ ఇటీవలనే గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. సమ్మిళిత, పోర్టబల్ ప్రొడక్టివిటీ పవర్‌హౌస్ ఇది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే, వీడియోనే ముందు అనే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఖచ్చితమైన సహచరునిగా ఉండే రీతిలో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్ మీరు కోరుకున్న రీతిలో పనిచేసే స్వేచ్ఛ మరియు ఎక్కడైనా సరే మీరు కోరుకున్న రీతిలో ఆడుకునే సౌలభ్యం అందిస్తుంది.
శాంసంగ్ ఇండియా న్యూ కంప్యూటింగ్ బిజినెస్ హెడ్ సందీప్ పోశ్వాల్ మాట్లాడుతూ..'శాంసంగ్ వద్ద, మా ప్రయత్నమెప్పుడూ కూడా మహోన్నతమైన వినియోగదారుల అనుభవాలను అందించే రీతిలో అర్థవంతమైన ఆవిష్కరణలను చేయడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమమైనది మాత్రమే అందించడం. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్ విప్లవాత్మక మల్టీటాస్కింగ్ సామర్థ్యాలను, శక్తివంతమైన ఉత్పాదకత మరియు విలాసవంతమైన హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. ఇది మీ పని మరియు ఆటలకు తగిన స్వేచ్ఛను, సౌకర్యమునూ అందిస్తుంది` అని అన్నారు.
ట్యాబ్ ఎస్ సిరీస్ సిరీస్‌లో మొట్టమొదటి గెలాక్సీ ట్యాబ్ ఎస్8
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 విస్తారమైన 14.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనిని ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ రక్షిస్తుంది. ఇది 12 మెగా పిక్సెల్ ముందు కెమెరా తో పాటుగా అత్యాధునికమైన ఆటో ఫ్రేమింగ్ సాంకేతికతతో వస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ర్టా మీ వీడియో కాల్ అనుభవాలను సమూలంగా ప్రొఫెషనల్ 4కె వీడియో నాణ్యతతో మారుస్తుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పనిచేయండి, ఆటలాడండి మరియు కనెక్ట్ అవండి
అత్యంత వేగవంతమైన 4ఎన్ఎం చిప్సెట్ శక్తివంతమైన గెలాక్సీ ట్యాబ్ ఎస్8ను సాటిలేని పనితీరు అందించే రీతిలో శక్తివంతమైన, ల్యాగ్ ఫ్రీ గేమింగ్ లేదా సరళమైన మల్టీటాస్కింగ్ ను అతి సులభంగా అందించే రీతిలో తీర్చిదిద్దారు. ఇంటిగ్రేటెడ్ ఎస్ పెన్‌తో మీరు మీ స్ర్కీన్‌ను కాన్వాస్‌గా మలచవచ్చు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ర్టా మరియు గెలాక్సీ ట్యాబ్ ఎస్8లు అభివృద్ధి చేసిన ఎస్ పెన్‌తో వస్తాయి. ఇవి ప్రిడిక్షన్ అల్గారిథమ్‌ను అతి తక్కువ లాటెన్సీ కోసం వినియోగిస్తుంది. ఇది అసాధారణ రాత అనుభవాలనూ అందిస్తుంది.
గెలాక్సీతో జీవితం తెరుచుకుంటుంది
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్ అత్యంత సౌకర్యవంతమైన రీతిలో మొత్తం గెలాక్సీ పర్యావరణ వ్యవస్ధలో పనిచేస్తుంది . శాంసంగ్ యొక్క ఒన్ యుఐ ట్యాబ్ 4 వినియోగదారుల ఇంటర్ఫేజ్ స్ధిరంగా అతి సహజమైన అనుభవాలను, సౌకర్యవంతమైన కనెక్టివిటీ తో పాటుగా స్మార్ట్ ఇంటిగ్రేషన్స్ అందిస్తుంది. మెరుగైన శాంసంగ్ డెక్స్ సౌకర్యవంతమైన డెస్క్‌టాప్ అనుభవాలను అందిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌ను శాంసంగ్ యొక్క నాక్స్ వాల్ట్ ప్లాట్‌ఫామ్ రక్షించింది. ఇది వ్యక్తిగత డాటాను అందించడంతో పాటుగా నిల్వ చేసిన ఫైల్స్ మరియు సమాచారం భద్రంగా మారుస్తుంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ టాబ్లెట్‌పై శాంసంగ్ ఇప్పుడు శాంసంగ్ హెల్త్ యాప్ పరిచయం చేసింది. ఇది మీ ఫిట్నెస్ రొటీన్‌ను భద్రపరుస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధరలు మరియు లభ్యత
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ర్టా ట్యాబ్ గ్రాఫైట్ కలర్లో లభ్యమవుతుంది. అదే సమయంలో గెలాక్సీ ట్యాబ్ ఎస్8 మరియు ఎస్8లు గ్రాఫైట్, సిల్వర్ మరియు పింక్ గోల్డ్ కలర్స్‌లో లభ్యమవుతాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ర్టా 12 జీబీం256జీబీ స్టోరేజీలో లభ్యమవుతుంది. దీని ధర 1,08,999 రూపాయలు వై ఫై వేరియంట్‌కు కాగా , 1,22,999 రూపాయలను 5జీ వేరియంట్‌కు నిర్ణయించారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 మరియు ట్యాబ్ ఎస్8లు 8జీబీ 128 జీబీ వేరియంట్లో లభ్యమవుతాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ధర 74,999 రూపాయలను వై ఫై వేరియంట్‌కు 87,999 రూపాయలను 5జీ వేరియంట్‌కు నిర్ణయించారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ధర 58,999 రూపాయలను వై ఫై రకానికి, 70,999 రూపాయలను 5జీ వేరియంట్‌కు నిర్ణయించారు.
పరిచయ ఆఫర్లు
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్, ముందస్తు ఆర్డర్ల కోసం ఫిబ్రవరి 22, 2022, మార్చి 10,2022 తేదీల నడుమ శాంసంగ్ డాట్ కామ్ మరియు ఇతర సుప్రసిద్ధ శాంసంగ్ ఆధీకృత భాగస్వాముల వద్ద లభ్యమవుతుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌ను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులు ఉచితంగా 22,999 రూపాయల విలువ కలిగిన కీబోర్డ్ కవర్‌ను పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అలా్ట్ర కొనుగోలుపై మరియు 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను గెలాక్సీ ట్యాబ్ ఎస్8 + పై, 7వేల క్యాష్‌బ్యాక్‌ను గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్‌లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు వినియోగించి కొన్న ఎడల అందిస్తారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌పై నో కాస్ట్ ఈఎంఐ అవకాశాలు కూడా లభ్యమవుతాయి.