Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైవిధ్యతతో 2.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ కలిగిన సి.కె.బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తన ఎగ్జాస్ట్ ఫ్యాన్ల శ్రేణిని స్టైల్, పనితీరు, సామర్థ్యం, మన్నికలను నిర్వచించే నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన కొత్త మోడళ్లను విడుదల చేసింది. మన్నిక మరియు సామర్థ్యం కోసం శక్తివంతమైన కాపర్ మోటరు, అధిక మొత్తంలో గాలిని పీల్చుకునే సామర్థ్యం, మృదువైన పనితీరుకు ఏరోడైనమిక్‌గా రూపొందించిన బ్లేడ్లు, సులభంగా శుభ్రం చేయగల ఉపరితలాలు, తక్కువ విద్యుత్తు వినియోగం మరియు 2500 ఆర్పిఎం వరకు అధిక వేగంతో పని చేయడంతో సహా వినియోగదారు-కేంద్రీకృత లక్షణాల శ్రేణితో కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ల విభాగంలో మార్కెట్లో తన వాటాను దూకుడుగా వృద్ధి చేసుకోవాలన్న కంపెనీ ప్రణాళికల్లో భాగంగా వీటిని విడుదల చేసింది. వంటగదులు, బాత్రూమ్లు, గాలి వెలుపలకు వెళ్లని ప్రదేశాలలో ఉపయోగించేందుకు అనువుగా తయారు చేసిన ఓరియంట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వెంటిలేషన్‌తో ఇండోర్లలో గాలి నాణ్యతను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయి. గాలిలోని అవాంఛిత వాసనలు, తేమ, పొగ మరియు ఇతర హానికరమైన కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడడంతో, మీ ఇండోర్ ప్రదేశాలను తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు అతుల్ జైన్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ మార్కెట్ దాదాపు రూ.700 కోట్లతో చక్కని పురోగతితో వృద్ధి చెందుతోంది. మహమ్మారి నేపథ్యంలో మంచి వెంటిలేషన్, తాజా, స్వచ్ఛమైన ఇండోర్ గాలిని కలిగి ఉండటం తదితరాలరకు ప్రాముఖ్యత ఇచ్చిన వినియోగదారుల అవగాహనే ఈ వృద్ధి రేటుకు కీలక కారకాల్లో ఒకటిగా ఉంది. ప్రజలు చక్కని వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉండాలని ఆరోగ్య నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే మంచి ఇండోర్ గాలి ప్రసరణ వైరస్‌లతో సహా గాలిలో కలుషితాల సాంద్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్త మోడళ్ల విడుదలతో, మేము ఇప్పుడు విభిన్న వినియోగ పరిసరాలకు, సౌందర్య ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి స్థాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అందిస్తున్నాము. అదే సమయంలో మా వినియోగదారులకు వారి ఇండోర్ లివింగ్ స్పేస్‌లను తాజాగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ విభాగంలో బలమైన పట్టు సాధించేందుకు ఈ ప్రయోగం మాకు సహాయపడుతుందని మేము భావిస్తున్నాము’’ అని తెలిపారు.
ఓరియంట్ తాజాగా విడుదల చేసిన కొత్త ఎగ్జాస్ట్ ఫ్యాన్లకు స్మార్ట్ ఎయిర్, స్మార్ట్ ఎయిర్ నియో, వెనిటో ఎయిర్, యాక్సియల్ ఫ్లో, పవర్ ఫ్లో అని పేరు పెట్టారు. మొత్తం 8 కొత్త ఎస్కెయులు ఉన్నాయి. ఉడెన్, గ్రే, ఆఫ్-వైట్, సిల్వర్‌తో సహా నాలుగు విభిన్న ఫినిషింగ్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏదైనా సమకాలీన స్పేస్‌కు నిండుదనాన్ని తీసుకు వచ్చేలా తయారు చేశారు. కొత్త శ్రేణిలోని ఇతర ముఖ్యమైన లక్షణాల్లో గ్లాస్ మౌంటు సామర్ధ్యం, ఫ్రంట్ ఆటో-షట్ లౌవ్లు మరియు బర్డ్ ప్రొటెక్షన్ గార్డ్ ఉన్నాయి. కొత్త శ్రేణి ఉత్పత్తులు 2 ఏళ్ల వారంటీతో, రూ.1450 ధరలో లభిస్తుంది.