Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ3లో 5.4 శాతానికి పరిమితం
- ఇంధన ధరల దెబ్బ..!
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.4 శాతానికి పరిమితమయ్యింది. కేంద్ర గణంకాల శాఖ (ఎన్ఎస్ఒ) సోమవారం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే వృద్థి పడిపోయింది. గడిచిన ఏప్రిల్- జూన్త్రైమాసికంలో జీడీపీ 20.1 శాతం పెరగ్గా.. జులై సెప్టెంబర్ కాలంలో 8.4 శాతం వృద్థిని సాధించింది. క్రితం క్యూ3లో వ్యవసాయ రంగం 2.6 శాతం పెరుగుదలకు పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో ఈ రంగం ఏకంగా 4.1 శాతం వృద్థిని కనబర్చింది. గడిచిన త్రైమాసికంలో జిడిపిని అధిక ఇంధన ధరలు ఒత్తిడికి గురి చేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఒ జీడీపీ అంచనాలను 8.9 శాతానికి కోత పెట్టింది. దీన్ని ఇంతక్రితం 9.2 శాతంగా అంచనా వేసింది. క్రితం క్యూ3లో జీడీపీ తమ అంచనాలు 5.7 శాతానికంటే తక్కువగా నమోదయ్యిందని ఎలరా కాపిటల్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో ప్రతికూల వృద్థి చోటు చేసుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు. కరోనా సంక్షోభం పలు రంగాలను ఒత్తిడికి గురి చేసిందన్నారు. ప్రస్తుత మార్చితో ముగిసే త్రైమాసికంలో కరోనా ఆంక్షలు తొలిగినప్పటికీ.. రష్యా, ఉక్రెయిన్ ఆందోళనలు ప్రపంచ వృద్థి రేటుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు. ఇది దేశీయ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.