Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ అమ్యూజ్మెంట్ పార్క్‌లో మహిళలు సరదాగా విహరించేందుకు వండర్లా హైదరాబాద్ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. వండర్లా ఎంట్రీ టిక్కెట్‌పై రూ.1,049/- (జిఎస్టితో కలిపి) ఒన్ + ఒన్ ఆఫర్‌ను అందిస్తోంది. వండర్లా అమ్యూజ్మెంట్ పార్కులో మహిళలు తమ గర్ల్ గ్యాంగ్‌తో ప్రపంచ స్థాయి రైడ్లు మరియు ఆకర్షణలను ఈ ప్రత్యేకమైన రోజును సరదాగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
మార్చి 8న, అమ్యూజ్మెంట్ పార్కులో 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న మగవారిని అనుమతించరు. ఈ ఆఫర్ ఆన్లైన్ బుకింగ్‌తో పాటు వాక్-ఇన్లకు, మహిళా సందర్శకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మార్చి 8న మగవారు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకుని ఉంటే, అది రద్దు చేయబడుతుంది. మార్గదర్శకాలు, ఉత్తమ అభ్యాసాలను అనుగుణంగా, ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ apps.wonderla.co.in ద్వారా తమ ఎంట్రీ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోమని వండర్లా తన సందర్శకులను ప్రోత్సహిస్తుంది. వండర్లా హైదరాబాద్ పార్క్ ఇప్పుడు అన్ని రోజులు తెరిచి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.wonderla.comని సందర్శించండి లేదా 8414676300కు కాల్ చేయండి.