Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనరేటర్లు, వ్యవసాయ యంత్రసామాగ్రి, పలు యంత్ర పరికరాల కోసం ఇంజిన్స్ తయారీలో అగ్రగామి
న్యూఢిల్లీ: భారతదేశంలో పవర్ ప్రొడక్ట్స్ తయారీలో అగ్రగామి హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (HIPP), ఫిబ్రవరి 2022 నాటికి మొత్తంమ్మీద 5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. తమ మహోన్నతమైన వినియోగదారుల వృద్ధిలో నమ్మకమైన భాగస్వామిగా కంపెనీ తమ లక్ష్యమైన ‘ఎంపవర్ పీపుల్, టు డు బెటర్’కు అనుగుణంగా నిలుస్తుంది.
భారతదేశంలో పోర్టబల్ జనరేటర్ మోడల్ ఈఎం 650ను మొట్టమొదటిసారిగా HIPP తమ రుద్రపూర్ ఫ్యాక్టరీ వద్ద 1988లో ఉత్పత్తి చేసింది. అప్పటి నుంచి భారతదేశ వ్యాప్తంగా పవర్ బ్యాకప్, వ్యవసాయం, నిర్మాణ రంగాలలో విభిన్న ఉత్పత్తులను తమ గ్రేటర్ నోయిడా, పుదుశ్చేరి ప్లాంట్లలో తయారుచేస్తోంది. తకహిరో యుఎడా, సీఎండీ, ప్రెసిడెంట్ అండ్ సీఈవో, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ భారత ప్రజలు, స్ధానిక ప్రజల మద్దతుతో 5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా సరఫరాదారులు, భాగస్వాములు మాకు వెన్నంటి నిలవడంతో పాటుగా మహమ్మారి సమయంలో కూడా అపూర్వమైన తోడ్పాటునందించారు. భారతదేశంతో పాటుగా ఇక్కడి సమాజానికి తమ తోడ్పాటును హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్లిమిటెడ్ అందించనుంది’’ అని అన్నారు.