Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మార్ట్‌ఫోన్ ధర రూ.7499
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తన 8 సీరిస్‌లో కొత్త స్పార్క్ 8సిని విడుదల చేసినట్లు తెలిపింది. 6.6 అంగులాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్‌ను ఆక్టా కోర్ ప్రాసెసర్, 90 హెర్ట్జ్ అత్యున్నత రిఫ్రెష్ రేట్‌తో ఆవిష్కరించినట్లు వెల్లడించింది. 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 13 ఎంపి ఎఐ డ్యూయల్ కెమెరా, 3జిబి ర్యామ్ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. దీని ప్రారంభ ధరను రూ.7499గా నిర్ణయించినట్లు వెల్లడించింది.