Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో 11 శాతం వృద్థి :
నైట్ ఫ్రాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో అధిక ఆదాయం కలిగిన సంపన్నులు భారీగా పెరుగుతున్నారని నైట్ ఫ్రాంక్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతేడాది రూ.226 కోట్ల పైగా (30 మిలియన్ డాలర్లు) సంపద కలిగిన వారు 11 శాతం పెరిగారని తెలిపింది. కరోనా కష్ట కాలంలో పేద, మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతుటే మరోవైపు ధనవంతులు ఈ స్థాయిలో పెరగడం విశేషం. 2021లో ప్రపంచంలో అత్యధిక కుబేరులు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ది వెల్త్ రిపోర్ట్ -2022లో తెలిపింది. తొలి స్థానంలో 748 బిలియనీర్లతో అమెరికా, చైనాలో 554 బిలియనీర్లు, భారత్‌లో 145 మంది బిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. రూ.7500 కోట్ల పైగా సంపద కలిగిన వారు ఈ కేటగిరిలోకి వస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల్లో 9.3 శాతం పెరుగుదల ఉండగా.. ఈ సగటు కంటే భారత్‌లో ఎక్కువ నమోదయ్యారు. 2020లో భారత్‌లో రూ.226 కోట్ల పైగా అధిక సంపద కలిగిన వారు 12,287 మంది ఉండగా.. గతేడాది ఈ సంఖ్య 13,637కు పెరిగింది.