Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్కర్ అరుసి వెల్లడి
ముంబయి : టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ బాధ్యత లను స్వీకరించలేనని టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మెన్ ఇల్కర్ అరుసి వెల్లడించారు. ఏఐ చీఫ్గా ఇల్కర్ను తీసుకున్నట్టు ఇటీవలే టాటా గ్రూప్ తెలిపింది. తన నియామకంపై భారత్లోని కొన్ని వర్గాలు అవాంఛనీయమైన రీతిలో రంగు పులమడానికి యత్నించాయని ఇల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. టర్కీ రాజకీయ నేతలతో ఇల్కర్కు సంబంధాలున్నాయని..ఆయన నియామకాన్ని రద్దు చేయాలని ఇటీవల ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల టాటా గ్రూప్ చైర్మెన్ చద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో ఈ వివరాలను తాను ఆవేదనతోనే వెల్లడించినట్టు ఇల్కర్ తెలిపారు.