Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గ్లోబల్ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి చెందారు. 26 ఏండ్ల జైన్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మరణించారు. జైన్ నాదెళ్ల మృతితో సత్యనాదెళ్ల, అను నాదెళ్ల దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. 1996 ఆగస్టు 13న జైన్ జన్మించాడు. తన కుమారుడు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధి సెలెబ్రల్ పాల్సీతో బాధపడుతున్నట్టు 2017 అక్టోబర్లో సత్య నాదెళ్ల తొలిసారిగా బయటి ప్రపంచానికి వెల్లడించారు. పుట్టుకతోనే ఆయన మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. మరణ వార్తను ఆ సంస్థ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటుగా సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న జైన్ చిన్నప్పట్నుంచే వీల్ చైర్కు పరిమితం అయ్యారు.