Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికంగా, అంతర్జాతీయంగా ఆవిష్కరణలు పెంచేందుకు భారత్‌లో ప్రొడక్ట్ అభివృద్ధి వ్యవస్థ నిర్మించనున్న ఒప్పో
- ఎండ్ యూజర్లకు సంబంధించి పర్ఫామెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయనున్న సరికొత్త వ్యవస్థ
హైదరాబాద్ : యూజర్‌కు మరింత మెరుగైన అనుభూతి అందించేందుకు హైదరాబాద్‌లోని ఆర్డడీ సెంటర్లో ప్రత్యేకమైన పవర్ అండ్ పర్ఫామెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్ డివైస్ బ్రాండ్ ఒప్పో ప్రకటించింది. వేగవంతమైన జీవనశైలి కారణంగా యువభారతీయులకు లాంగ్ బ్యాటరీ లైఫ్, తక్కువ పవన్ కన్సంప్షన్ ఉండే హై పర్ఫామెన్స్ డివైసుల కావాల్సి వస్తోంది. నిజ జీవిత అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత యూజ్ కేసెస్ బట్టి డివైసులను మరింత ఎనర్జీ ఎఫిషియంట్‌గా మార్చే ఆవిష్కరణ దిశగా ఈ ల్యాబ్ పనిచేస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తలెత్తే సాఫ్ట్వేర్ బగ్స్, ఎండ్ యూజర్ అనుభూతిని మెరుగుపరిచేందుకు ఆ కీలకమైన సమస్యలకు కొత్తగా నెలకొల్పిన ఈ ల్యాబ్ సవాల్ విసురుతుంది. అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో కూడిన ఈ ల్యాబ్, గేమింగ్ వంటి విపరీతమైన యూసేజ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో కాలింగ్ అండ్ స్ట్రీమింగ్ విషయంలో సరికొత్త ఆవిష్కరణలతో యూజర్లకు చక్కని పనితీరుతో పాటు అధిక బ్యాటరీ లైఫ్ అందించేందుకు కృషి చేస్తోంది. ఈ ల్యాబ్‌లోని ఇంజినీర్లు, బ్యాటరీ పనితీరు సహ ఇతర అంశాల్లో కొత్తదనంతో పాటు డివైస్ హీటింగ్ మెరుగుపరిచి ఎండ్ యూజర్‌కు చక్కని ప్రొడక్ట్ అనుభూతి అందిస్తారు.
ల్యాబ్ ప్రారంభం సందర్భంగా ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్డడీ హెట్ తస్లీమ్ ఆరీఫ్ మాట్లాడుతూ 'భారత్ నుంచి పూర్తి ప్రొడక్ట్ డెవలప్ చేయాలన్న మా కలలు సాకారం చేసే దిశలో ఈ పవర్ అండ్ పర్ఫామెన్స్ ల్యాబ్ మూడో అత్యంత ముఖ్యమైన పురోగతి. ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటున్న సవాళ్లు, అనిశ్చితితో కూడిన ఈ సమయంలో ఇన్సిపిరేషన్ అహెడ్ అన్న మా దార్శనికతను అనుగుణంగా ఆశాభావం, స్ఫూర్తిని నింపేలా స్మార్ట్ ఫోన్ల కోసం ఆవిష్కరణ నుంచి తయారీ వరకు భారత్‌లో సాగేలా ఒక స్వయం సుస్థిర వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం.` అని అన్నారు.
ల్యాబ్ నుండి ఆశించే పరిణామాల గురించి తస్లీమ్ మాట్లాడుతూ..'యూజర్ అనుభూతిపరంగా ముఖ్యంగా భారత్‌లో 5జీ రానున్న తరుణంలో ఈ ల్యాబ్ సరికొత్త విప్లవాన్ని తీసుకువస్తుంది. ప్రతి 5జీ పరికరానికి తప్పనిసరిగా ఉండే స్టెల్లార్ పవర్ ఆప్టిమైజేషన్, అనుపమామైన పనితీరు అందించే పరిష్కారాలను ఈ ల్యాబ్ అభివృద్ధి చేస్తుంది. ఆర్ అండ్ డీ సెంటర్‌తో పాటు ఈ ఆప్టిమైజేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్ల చేతికి అందేలా మానవజాతి కోసం టెక్నాలజీ అభివృద్ధి చేయాలని ఒప్పో సంకల్పిస్తోంది` అన్నారు.
ప్రొడక్టు జీవితకాలం పాటు యూజర్లకు స్థిరమైన ప్రీమియం అనుభూతి అందించేందుకు వేగవంతమైన, మృదువైన పర్ఫామెన్స్పై ప్రత్యేక దృష్టి నిలుపుతూ పరిశోధన, ఆవిష్కరణ దిశగా నడిపించేందుకు కొత్తగా నెలకొల్పిన ల్యాబ్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది. అధిక యూసేజ్ ఉన్నా మొత్తంగా పవర్ కన్సంప్షన్ తగ్గించేందుకు, సురక్షితమైన ప్రీమియం అనుభూతి అందించడంతో పాటు డివైస్‌లో హీటింగ్ ఎఫెక్ట్ తగ్గించేలా ఒఎస్ లెవల్స్ మార్చడంపై ఈ పవర్ ల్యాబ్ దృష్టి నిలుపుతుంది.
స్థిరమైన యూజర్ అనుభూతి అందించేలా ప్రొడక్ట్స్ డెవలప్ చేసేందుకు పర్ఫామెన్స్ ల్యాబ్ ఆర్ అండ్ డీ తోడ్పాటు అందిస్తుంది. ల్యాబ్‌లో నెలకొల్పిన అత్యాధునిక ఈక్విప్మెంట్ టెస్ట్, ఆప్టిమైజ్, ఇన్నోవేట్ చేసేందుకు టీమ్‌కు సాయపడుతుంది. అంతే కాదు యూజర్‌కు మెరుగైన అనుభూతి, మెరుగైన పనితీరు అందించేలా అంటే అధిక పనితీరు గల గేమింగ్, వీడియో క్యాప్చరింగ్, లో లైట్ ఫొటోగ్రఫీ ప్రాసెసింగ్ ఇంటెన్సివ్ ఆపరేషన్ సహా మెజారిటీ సందర్భాలకు తగినట్టుగా డివైసులు ఉండేలా ఈ ల్యాబ్ చూస్తుంది. ఒప్పో భవిష్యత్ ప్రొడక్టులు పవర్, పర్ఫామెన్స్ విషయంలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండేలా ఈ ల్యాబ్ ఆవిష్కరణలు చూస్తాయి.
హై-స్పీడ్ ఫ్లాష్ ఛార్జింగ్ విషయంలో రెండు పురోగతులు సాధించినట్టు ఇటీవలే ఒప్పో ప్రకటించింది: బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE)తో 150W SUPERVOOC, 240W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ. BHE (బ్యాటరీ హెల్త్ ఇంజిన్)తో కూడిన 150W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ - ఛార్జ్ బంప్‌లతో డైరెక్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది, దాని వలన ఇది 4500mAh బ్యాటరీని 1 శాతం నుండి 50 శాతం వరకు 5 నిమిషాల్లో మరియు 15 నిమిషాల్లో 100శాతం వరకు ఛార్జ్ చేయగలదు. 240W SUPERVOOC సాంకేతికత 24V/10A ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 4200mAh బ్యాటరీని 9 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.
హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ సెంటర్లో 2 సంవత్సరాల క్రితం 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్, కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఒప్పో ప్రారంభించింది. ఇది 5జీ, కెమెరా రంగాల్లో కొత్తదనాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. 450 ప్లస్ సభ్యులతో భారత్‌లోని ఆర్ అండ్ డీ సెంటర్ ముందుకు సాగుతోంది. ఎండ్ యూజర్లకు అవసరమైన సందర్భాలకు తగినట్టుగా సేవలందించేందుకు మరిన్ని సబ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పో ప్రయత్నిస్తోంది.