Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎస్ఎంఈలు వృద్ధి చెందేందుకు మహమ్మారి సమయంలో ఐదు కంపెనీలు తోడ్పాటునందించగా.. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎస్ఎంఈ రంగంపై కోవిడ్ - 19 మహమ్మారి విరుచుకుపడింది. సరఫరా చైన్ అంతరాయాలు, అమ్మకాలలో క్షీణత కారణంగా ఎస్ఎంఈలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారతదేశపు 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు భారతీయ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచినప్పటికీ లాక్డౌన్స్, నైట్ కర్ఫ్యూల కారణంగా అమ్మకాల పరంగా 2021లో 11% క్షీణత నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. అంతకు ముందు అది మరింత దిగజారి 46% క్షీణత కనిపించింది.
అయితే ఈ సమయమే ఎస్ఎంఈలు పూర్తిగా డిజిటల్‌గా రూపాంతరం చెందేందుకు అవకాశామూ కల్పించింది. ఆర్ధిక సంస్ధల తోడ్పాటుతో ఎస్ఎంఈలు తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌కు తీసుకువెళ్లగలిగారు. ఈ ఆర్ధిక సంస్థలే ఈ ఎస్ఎంఈలకు అవసరమైన పూర్తి మద్దతును అందించడంతో పాటుగా ఉద్యోగుల ఆర్థిక సంక్షేమం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయపడ్డాయి.
ఈ స్టార్టప్స్ ప్రయత్నాల కారణంగా చిరు వ్యాపార సంస్ధలు ఆన్లైన్లో రుణాలను పొందడం, ఆన్లైన్లో ఆర్డర్లను తీసుకోవడం, క్యుఆర్ కోడ్స్‌ను ఏర్పాటుచేసుకోవడం సాధ్యమైంది. ఈ దిగువన ఎస్ఎంఈలకు మద్దతునందించిన 5 స్టార్టప్స్ గురించి వెల్లడించాము. ఇవి మహమ్మారి సమయంలో కేవలం ఎస్ఎంఈలు మనుగడ సాధించడంలోమాత్రమే కాదు అవి అసాధారణ వృద్ధి సాధించడంలో సైతం తోడ్పడ్డాయి.
1. ప్రోటియం - ఎంఎస్ఎంఈ వ్యాపార ఋణాలు
ఎస్ఎంఈలకు సంప్రదాయ బ్యాంకుల నుంచి ఋణాలు పొందడం పెను సవాలు. ప్రోటీయం పూర్తి స్థాయిలో ఋణాలను అందించే సంస్థ. ఋణాలను పొందాలనుకుంటున్న వ్యక్తి ఉంటున్న ప్రాంతం, భాష తదితర కారణాల వల్ల ఋణం తిరస్కరించబడకూడదని నమ్ముతుంది. ఈ సంస్ధ ఒక లక్ష నుంచి 5 కోట్ల రూపాయల వరకూ ఋణాలను ఎస్ఎంఈలకు అందించింది. అలాగే ప్రోటియం సాక్షరతో పాఠశాలలకూ తోడ్పాటునందించింది.
2. వాల్యు డాట్ ఏఐ (Valyu.ai)
ఎస్ఎంఈల కోసం పనిచేస్తున్న బ్లూ కాలర్ ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. వీరికి అవసరమైన మద్దతును వాల్యూ డాట్ ఏఐ అందించింది.
3. డిజిచల్ (DigiChal)ఉ ఎస్ఎంఈలు డిజిటల్‌గా వెళ్లేందుకు సహాయపడింది..
లాక్డౌన్స్ మరియు భద్రత పట్ల ఆందోళనలు కారణంగా ఎంతోమంది ఆన్లైన్ వైపు దృష్టి మళ్లించేలా చేసింది. డిజిచల్ ఈ విషయంలో చిరు వ్యాపారులు డిజిటల్‌గా మారేందుకు తోడ్పడింది. స్టోర్యజమానులు, చిరు వ్యాపారుల కు సేవలనందిస్తున్న యాప్ ఇది.
4. లోడ్ షేర్ నెట్వర్క్స్ - ఎస్ఎంఈల కోసం లాజిస్టిక్స్ నిర్మాణం
ఎన్నో ఎస్ఎంఈలు ఈ-కామర్స్ మార్గంలో తమ వ్యాపారాలను నిర్వహించాయి. లోడ్ షేర్ నెట్వర్క్స్ ఈ ఎస్ఎంఈల లాజిస్టిక్ సవాళ్లను అధిగమించేందుకు తోడ్పడ్డాయి.
5. పేయు (PayU)
ఎస్ఎంఈలకు మద్దతునందించేందుకు, ఖర్చులను తగ్గించేందుకు పేయు పలు కార్యక్రమాలను ప్రారంభించింది. భారతదేశంలో పే యు 4.5 లక్షల వ్యాపారులకు 100కు పైగా చెల్లింపు విధానాలతో మద్దతునందిస్తుంది.