Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడిన గుడ్ మ్యాన్ బ్రాందీ లక్ష్యం.. బ్రౌన్ స్పిరిట్స్ విభాగంలో బకార్డి ఉనికిని పటిష్ఠం చేయడం
హైదరాబాద్ : పరిమాణం పరంగా దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ స్పిరిట్స్ కంపెనీ అయిన బకార్డి ఇండియా కంపెనీ మొట్టమొదటి భారతీయ వినూత్నత, ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడిన గుడ్ మ్యాన్ ఆవిష్కా రంతో బ్రాండీ, ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విభాగంలోకి తన ప్రవేశాన్ని ప్రకటించింది. తాజా వినూత్నతతో, తన బ్రౌన్ స్పిరిట్స్ విభాగాన్ని పటిష్ఠం చేసుకునేలా బకార్డి ఇండియా భారతీయ ఆధునిక వినియోగదారుల కోసం తిరుగులేని అనుభూతిని అందించే ప్రీమియం బ్రాందీ విభాగంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కనీసం రెండేండ్ల ఓక్ కాస్క్ లతో రూపొందే ఈ ప్రీమియం బ్లెండెడ్ బ్రాందీ అనేది ప్రీమియం ఫ్రెంచ్, ఇండియన్ గ్రేప్ బ్రాందీలతో గ్రెయిన్ స్పిరిట్ పరిపూర్ణ సమ్మే ళనంగా ఉంటుంది.
ఊడీ ఫ్లేవర్స్, పీర్, యాపిల్, ఫ్రూటీ నోట్స్, స్వీట్ వెనిల్లా, హనీ లతో రూపుదిద్దుకునే ఈ ద్రావకం ఐస్ లేదా మిక్సర్ తో ఆ నందించేందుకు అనువుగా ఉంటుంది. అత్యుత్తమ రకాలను కోరుకునే నూతన తరం వినియోగదారులు వేడుక చేసు కునేలా, తమ వ్యక్తిత్వ అన్వేషణలో మరింత ధైర్యంగా ఉండేలా చేస్తుంది.
ఈ సందర్భంగా బకార్డి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజిత్ రాంధావా మాట్లాడుతూ, 'గుడ్ మ్యాన్ ఆవిష్కరణతో ప్రీమియం బ్రాందీ విభాగంలోకి బకార్డి ఇండియా ప్రవేశాన్ని ప్రకటించడం మాకెంతో ఆనందదాయకం. 2030 నాటికి వ్యాపారాన్ని ఐదిం తలు చేసుకోవాలన్నది మా ఆశయం. ఈ ఆవిష్కరణ అనేది మార్కెట్ పట్ల మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తోంది. మా ప్రీమియం పోర్ట్ ఫోలియోను అది మరింత పటిష్ఠం చేస్తుంది. బ్రౌన్ స్పిరిట్స్ విభాగంలో మరింత పెద్ద వాటాను సొంతం చేసు కోవడాన్ని కొనసాగిస్తాం. దేశంలో మా ఉనికిని పటిష్ఠం చేసుకోవడంలో కూడా ఇదో పెద్ద ముందడుగు. మార్కెట్లో ఇది, మరీ ముఖ్యంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మొదటి ఇన్ ఉహౌస్ బ్రాండ్` అని అన్నారు.
బకార్డి కి సంబంధించి ఈ ప్రాంతంలో వినూత్నతలను పర్యవేక్షించే ఎఎంఈఏ (ఏషియా మిడిల్ ఉ ఈస్ట్ అండ్ ఆఫ్రికా) ఇన్నోవేషన్స్ హెడ్ ఆయేషా గూప్తు ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'వినూత్నత మాకెంతో కీలకం. వినియోగదారులకు అద్భుతమైన అనుభూతులను అందించేందుకు బకార్డి ఎప్పుడూ నూతన ఉత్పాదనలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగానే భారతీయ వినియోగ దారులకు మెరుగుపర్చబడిన డ్రింకింగ్ అనుభూతిని అందించడం లక్ష్యంగా గుడ్ మ్యాన్ ఆవిష్కరిం చబడింది. ఈ పోర్ట్ ఫోలియోలో ఇదెంతో ముఖ్యమైన ఆవిష్కరణ. 'ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్స్` దృక్పథంతో మేం ఎంతో ఆశావాదంతో ఉన్నాం. ఆరంభంలో మేం వినియోగదారుల సెంటిమెంట్ ను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడుతాం, ఆ తరువాత మేం ఈ బ్రాండ్ ను మరిన్ని మార్కెట్లకు తీసుకెళ్తాం` అని అన్నారు.
అంతర్జాతీయంగా భారతదేశం అతిపెద్ద బ్రాందీ మార్కెట్. ప్రపంచ వినియోగంలో 37% ఇక్కడే. దేశంలో రెండో అతిపెద్ద విభాగం ఇదే. దేశంలో బ్రాందీ విభాగం 3 % చొప్పున పెరుగుతోంది. ప్రీమియం బ్రాందీ విభాగం మరింత వేగంగా 16% చొ ప్పున పెరుగుతోంది. భారతదేశంలో గుడ్ మ్యాన్ ను ప్రవేశపెట్టడంతో, బకార్డి ఈ ప్రీమియం బ్రాందీ విభాగంలో ఏకైక అంత ర్జాతీయ స్పిరిట్స్ సంస్థగా ఉంది. బాగా పోటీ ఉండే భారతీయ మార్కెట్ లో వృద్ధి చెందేందుకు, వైవిధ్యీకరణ అయ్యేందుకు తనకు గల కట్టుబాటును మరింత పటిష్ఠం చేసుకుంది.
కంపెనీకి భారతదేశం ఎంతో ముఖ్యమైన మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా గల 10 ప్రాధాన్య మార్కెట్లలో అది కూడా ఉంటుంది. వివిధ విభాగాల్లో ప్రీమియం స్పిరిట్స్ బ్రాండ్లలో బకార్డికి గల నాయకత్వ స్థాన, భారతదేశ ప్రీమియం స్పిరిట్ మార్కెట్ లో అప్ వర్డ్ ధోరణి కలగలసి గుడ్ మ్యాన్ ఆవిష్కరణకు దారి తీశాయి. నేటి తరం వినియోగదారులకు సమకాలీన, బోల్డ్ బ్రాండ్ ను అందించాలన్న ఆశయంతో ఇది రూపుదిద్దుకుంది. ప్రతీ ఇన్నోవేషన్, క్యాంపెయిన్ తో బకార్డి ఈ విభాగంలోకి చొచ్చుకెళ్తోం ది. వినియోగదారుల మారుతున్న ప్రాథమ్యాలను ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకొంటోంది. నూతన అనుభవాల కోసం వారి ఆరాటాన్ని కూడా గుర్తిస్తోంది.
ఈ సందర్భంగా బకార్డి ఇండియా మార్కెటింగ్ హెడ్ జీనత్ విల్కాసిమ్ మాట్లాడుతూ, 'దేశవ్యాప్తంగా వినియోగదారులు డ్రిం కింగ్ ఎంపికల్లో ప్రయోగాల కోసం చూస్తున్నారు. మరింతగా ప్రీమియం అనుభూతులను కోరుకుంటున్నారు. గుడ్ మ్యాన్ అంతర్జాతీయ వారసత్వంతో నూతన తరం భారతీయ మద్యప్రియులు తమ కోరికలను నెరవేర్చే వాటిని కనుగొనగలుగుతున్నారు. తమను తాము వ్యక్తీకరించుకోగలుగుతున్నారు. మద్యం తాగే అనుభూతిని ఆనందించగలుగుతున్నారు. అన్నిటి కంటే అత్యుత్తమైన దాన్ని పొందగలుగుతున్నారు` అని అన్నారు.
దేశం మొత్తపు బ్రాందీ మార్కెట్ లో దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం 98% వాటాను కలిగిఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గుడ్ మ్యాన్ మొదటగా దక్షిణాదినే ప్రవేశపెట్టబడింది. కేరళ, కర్నాటక, తెలంగాణ, పాండిచ్చేరిలలో ఇది అందుబాటులో ఉంటుంది.