Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైత్రేయి రామకృష్ణన్ డిస్నీ, పిక్సర్స్ టర్నింగ్ రెడ్లోని తన పాత్ర తనని ఎలా పోలి ఉంటుందో వివరించారు మార్చి 11న డిస్నీం హాట్‌స్టార్ ప్రీమియర్‌లో ప్రసారమయ్యే ఈ యానిమేటెడ్ చిత్రాన్ని చూడండి. ది లిండ్సే కాలిన్స్ నిర్మించిన టర్నింగ్ రెడ్ అనేది ఒక టీనేజర్ జీవితంలో హాస్యప్రజ్ఞ మరియు భావోద్వేగాల రంగులరాట్నపు రైడ్‌ను చూపిస్తుంది
హైదరాబాద్ : మిడిల్ స్కూల్ కష్టాలు, శరీరంలో వస్తున్న మార్పులు మరియు ఉరకలెత్తించే హార్మోన్లు ఇవన్నీ డిస్నీ మరియు పిక్సర్ నుంచి త్వరలో ప్రసారం కానున్న యానిమేటెడ్ చిత్రం టర్నింగ్ రెడ్ థీమ్‌ను ప్రత్యేకంగా చాటి చెబుతూ.. డోమీ షి దర్శకత్వం కూడా టీనేజ్‌లో ఉన్న పలువురి వ్యక్తిత్వాలపై ఆసక్తిని కలిగిస్తుంది. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్ గాత్రదానం చేసిన ప్రియ పాత్రలో కనిపించే విధంగా హైపర్ యాక్టివ్ నుంచి పెద్దరికంతో వ్యవహించే వరకు, ఈ చిత్రం ఎదుగుతున్న మనస్సుల సారాంశాన్ని అద్భుతంగా సంగ్రహిస్తుంది. ప్రియా పాత్రతో కలిసి ప్రయాణించడం మరియు ఓర్పుతో కూడిన ఆమె సిగ్నేచర్ పర్సనాలిటీని వివరించడం వంటి అనుభవాన్ని వివరిస్తూ, ఆమె పాత్ర నిజ జీవితంలో ఆమెను ఎలా పోలి ఉందో ఈ నటి పంచుకున్నారు. ప్రియా మరియు ఆమె స్నేహితులు తమ 'టర్నింగ్ రెడ్` క్షణాలను మార్చి 11వ తేదీన డిస్నీం హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళ భాషల్లో ప్రసారమవుతున్నప్పుడు స్వీయ అంగీకారం మరియు నిజమైన స్నేహానిని సంబంధించిన మనోహరమైన కథను వీక్షించండి.
నటి మైత్రేయి రామకృష్ణన్ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. 'రికార్డింగ్ చేస్తున్నప్పుడు ప్రియకు సంబంధించిన కఠినమైన స్కెచ్‌ను చూసినప్పటి నా మొదటి స్పందన నాకు గుర్తుంది. ఆమెకు నాకు ఎంతో సారూప్యం ఉంటుందని తెలుసుకున్న వెంటనే నేను చాలా సంతోషించాను- గుబురుగా ఉన్న జుట్టు, ముక్కు పోగు, కంటి అద్దాలు మరియు ముందు రోజు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉండడంతో కండ్ల కింద కొంచెం ఉబ్బులు అన్నింటిలోనే సామ్యత ఉంది! నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రియా లాగా నేను కచ్చితంగా నిశ్శబ్దంగా మరియు కూల్‌గా లేను, కానీ మేమిద్దరం ఎప్పుడూ స్నేహితుడిని అంటిపెట్టుకుని ఉండేందుకు సిద్ధంగా ఉంటాము` అని పేర్కొన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'ఉత్సాహంగా, విచారంగా లేదా కోపంగా అనిపించడం కూడా మోనోటోన్గా ఉండటం చాలా చక్కని లైన్. ప్రియా కేవలం మోనోటోన్ వాయిస్ ఉన్న వ్యక్తి, కానీ ఆమె ఇప్పటికీ ప్రతీ ఇతర మిడిల్ స్కూల్ టీనేజర్ భావాలనే కలిగి ఉంది, కనుక దాన్ని దృష్టిలో ఉంచుకోవడం కచ్చితంగా సహాయపడింది. ఉదయాన్నే రికార్డింగ్ చేయడం కూడా మోనోటోన్ని వినిపించేందుకు దోహదపడింది! కానీ నేను ఉదయానికరి అభిమాని కాదు` అని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని డోమీ షి మరియు జూలియా చో చమత్కారంగా రచించగా లిండ్సే కాలిన్స్ నిర్మించారు. రోసాలీ చియాంగ్, సాండ్రా ఓహ్, ఓరియన్ లీ, అవా మోర్స్, మైత్రేయి రామకృష్ణన్, హైన్ పార్క్, వాయ్ చింగ్ హో, జేమ్స్ హాంగ్ మరియు ఇతరులు ఈ చిత్రంలోని పాత్రలకు గాత్రదానం చేశారు.
ది టీనేజర్ జీవితంలోని ఒడిదుడుకులను మెయి లీ మరియు ఆమె స్నేహితులు ఎదుర్కొంటూ చేస్తున్న ప్రయాణంలో వారితో చేరేందుకు మార్చి 11న డిస్నీం హాట్‌స్టార్‌ను ట్యూన్ చేయండి!