Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ నుంచి ఎనిమిది మంది ఆకాష్ విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హత..
హైదరాబాద్ నుంచి ఎనిమిది మంది ఆకాష్ విద్యార్థులు ఎన్టీఎస్ఈ స్టేజ్2 క్లియర్ చేశాడు
గత సంవత్సరం మించిన రీతిలో ఎన్టీఎస్ఈ సెలక్షన్స్లో ఆకాష్ బైజూ విద్యార్ధులు ఎంపికయ్యారు
సైన్స్. సోషల్ సైన్సెస్లో కోర్సులతో పాటుగా వైద్య, ఇంజినీరింగ్ కోర్సులు చేయాలని భావిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్ధులను గుర్తించే జాతీయ స్ధాయి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎన్టీఎస్ఈ.
హైదరాబాద్ : ఆకాష్ + బైజూస్ విద్యార్థులు 440 మంది జాతీయ స్థాయిలో ఎన్టీఎస్ఈ 2021 స్కాలర్షిప్ కోసం అర్హత సాధించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష ఇది. హైదరాబాద్ నుంచి 8 మంది ఆకాష్ విద్యార్థులు అథర్య మోగి, ప్రతీక్ బోస్, హిమానీ చండ్రు, రెడ్డిపోగుల రాహుల్ రాజ్, మణిదీప్ రామ్ రాముడు, మోనిషా గౌడ్ బడుగు, బస్వరాజ్ అనూష్క మరియు గార శివాన రియా ఈ పరీక్షలో అర్హత సాధించడంతో పాటుగా ఎన్టీఎస్ఈ 2021 స్కాలర్షిప్ సాధించాడు.
ఈ ఫలితాలను గురించి ఆకాష్ + బైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ 'ఈ సంవత్సర ఫలితాలు అసాధారణం. మా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఈ ఫీట్ సాధించడానికి తీవ్రంగా శ్రమించారు. ఎన్టీఎస్ఈ స్టేజ్ 2లో 440 మంది ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ ఇది అత్యధికం. అందరికీ అభినందనలు` అని అన్నారు.
ప్రతి సంవత్సరం దాదాపు 2వేల స్కాలర్షిప్లను ఎన్టీఎస్ఈ లో భాగంగా దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. వీటిలో 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలు , 27%బీసీలకు 4% దివ్యాంగులకు కేటాయిస్తుంటారు.
--