Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఓ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మార్చి 05వ తేదీన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామం వద్ద ప్రారంభించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌తో ఈ ప్రాంత వ్యవసాయ క్షేత్రాలకు తగినంతగా నీరు లభించడంతో పాటుగా అదనంగా మరికొన్ని ఎకరాలు సాగులోకి రానున్నాయి.
మోజెర్లతో పాటుగా పెద్దమందడి మండల పరిధిలోని పలు గ్రామాలలో సామాజిక - ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరచాలనే లక్ష్యంతో అరబిందో ఫౌండేషన్ 1.50 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్ట్ కోసం అందించడంతో పాటుగా రామ్కీ ఫౌండేషన్‌తో కలిసి కేవలం నాలుగు నెలల్లో ప్రాజెక్ట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ భూగర్భ జలాలు, బోరు బావులు/ట్యూబ్ వెల్స్ద్వారా ఇక్కడ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మరింత భూమి సాగులోకి రావడంతో పాటుగా నీటి కొరత కూడా తగ్గుతుంది.
అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ 'అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఈ ప్రాజెక్ట్ కోసం 1.50 కోట్ల రూపాయలను అందించడంతో పాటుగా నాలుగు నెలల్లోనే రామ్కీ ఫౌండేషన్‌తో కలిసి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ప్రాజెక్ట్‌కు భూమి పూజను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యుల ఎస్ నిరంజన్ రెడ్డి చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం ఓ పంప్ హౌస్‌ను నిర్మించడంతో పాటుగా రెండు ప్రధానమైన పైపులైన్లను శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి మోజెర్ల గ్రామంలోని రెండు చెరువులకు వేశాం. ఈ ప్రాజెక్టుతో మరింతగా భూమి సాగులోకి రానుంది` అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో మొత్తంమ్మీద 1030 ఎకరాలు భూమి సాగు చేయవచ్చు. దీనిద్వారా మోజెర్లతో పాటుగా 2-3 గ్రామాలలో 1000 మందికి పైగా రైతులకు ప్రయోజనం కలుగనుంది.