Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి (NSE IFSC) రిసిప్టులు ఎన్ఎస్ఇ ఇంటర్నేషనల్ ఎక్ఛేంజ్‌లో లావాదేవీలు మరియు రిజిస్ట్రరు అవుతాయి
ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రిసిప్టులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు-ఐబియు జారీ చేస్తుంది.
హైదరాబాద్ : నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE)కు సంపూర్ణ యాజమాన్యపు అధీన సంస్థ ఎన్ఎస్ఇ ఇంటర్నేషనల్ ఎక్ఛేంజ్ (NSE IFSC) భారతదేశంలో మొదటి అన్స్పాన్సర్ డిపాజిటరీ రిసీట్స్ (NSE IFSC Receipts) లావాదేవీలను ప్రారంభించగా, ఇది ఐఎఫ్ఎస్సి సూచించిన రెగ్యులేటరీ స్యాండ్బాక్స్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి వస్తుండగా, ఇది భారతదేశంలోని రిటెయిల్ పెట్టుబడిదారులకు ఎన్‌వైఎస్‌ఇ మరియు నాస్డాక్లో లిస్ట్ అయిన యు.ఎస్. షేర్లను సులభంగా మరియు అందుబాటు విధానాల్లో పెట్టుబడి చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ప్రారంభంతో భారతదేశంలోని రిటెయిల్ పెట్టుబడిదారులు ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి ప్లాట్ఫారంలో భారతీయ రిజర్వు బ్యాంకు (("RBI")సూచించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (("LRS") పరిధిలో లావాదేవీలను నిర్వహించేందుకు అవకాశాన్ని కలిగి ఉంటారు.
ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదులు రిటెయిల్ పెట్టుబడిదారులకు ఆవిష్కారాత్మక మొట్టమొదటి పెట్టుబడి విధానం కాగా, వారికి వారి పెట్టుబడుల్లో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థల్లో లాభదాయకమైన కంపెనీలకు విస్తరించుకునేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదులు గ్లోబల్ షేర్లలో పూర్తి పెట్టుబడి ప్రక్రియను అడ్డంకులు లేని అలాగే తక్కువ ఖర్చులో పూర్తి చేస్తుంది. పెట్టుబడిదారులు ప్రపంచ మార్కెట్ల లో లావాదేవీలు నిర్వహిస్తున్న షేర్లలో కొంత ప్రమాణంలో లావాదేవీలు చేసే అవకాశాన్ని ఇస్తుంది. యు.ఎస్. షేర్లతో ప్రారంభించి ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి ఇతర గ్లోబల్ మార్కెట్లకూ తన ఆఫర్లను విస్తరించనుంది.
గిఫ్ట్ సిటీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సీ బ్యాంకింగ్ బ్యాంకింగ్ యూనిట్ (("HDFC Bank-IBU")కొత్తగా ప్రారంభించిన ఈ యుడిఆర్ కార్యక్రమానికి సంబంధించి ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదుల కస్టోడియన్‌గా తన పాత్రలో ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదులను అందిస్తుంది మరియు ఐఎఫ్ఎస్సిఎ రిజిస్ట్రర్డు డిపాజిటర్లలో రిజిస్ట్రర్డు డిపాజిటరీలో పాల్గొనేవారికి పెట్టుబడిదారుల డిపాజిటరీ ఖాతాలను ప్రారంభించడం తదితర లావాదేవీలను నిర్వహిస్తుంది.
ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (NICCL) తన దృఢమైన రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్కును అందిస్తుండగా, క్లియరింగ్ అనుకూలతను కల్పిస్తుంది మరియు డిపాజిటరీ రసీదుల్లో అన్ని లావాదేవీల సెటిల్మెంట్ నిర్వహిస్తుంది మరియు ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి ప్లాట్‌ఫారంపై నిర్వహించిన అన్ని లావాదేవీలకు సెటిల్మెంట్ గ్యారెంటీ అందిస్తుంది. అంతే కాకుండా అన్ని లావాదేవీలకు ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సికు సంబంధించిన అంశాలు పెట్టుబడిదారుల రక్షణ ఫ్రేమ్వర్కులో ఉంటాయి. పెట్టుబడిదారులు ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదులను గిఫ్ట్ సిటీలో ప్రారంభించిన వారి డిమ్యాట్ ఖాతాలో ఉంచుకునేందుకు అవకాశం ఇస్తుంది మరియు వారికి ఉన్న షేర్లకు సంబంధించిన కార్పొరేట్ చర్యలను ప్రయోజనాలను పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.
ఐఎఫ్ఎస్సిఎ అధ్యక్షుడు ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రసీదుల్లో లావాదేవీలను నిర్వహించడం ఆర్బిఐ లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్ పరిధిలో రిటెయిల్ విధానంలో పాల్గొనడాన్ని ఆకర్షించేందుకు ఉత్తమ విధానంగా ఉంది మరియు గిఫ్ట్ సిటీలో భారతదేశపు ఏకైక ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ (IFSC)లో ఉజ్వలమైన పెట్టుబడి మార్కెట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి ద్వారా ఈ ఆవిష్కరాత్మక ఆఫర్ రిటెయిట్ రెసిడెంట్ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి ప్లాట్ఫారం ద్వారా యు.ఎస్.షేర్లలో ప్రారంభంలో రెగ్యులేటరీ స్యాండ్బాక్స్ ద్వారా మరియు అనంతరం అన్ని అంతర్జాతీయ మరియు స్థానిక పెట్టుబడిదారులకు ఎక్ఛేంజ్ లిమిటెడ్ ఉత్పత్తిగా లావాదేవీలను నిర్వహించేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రిటెయిల్ పెట్టుబడిదారులకు ఆవిష్కారాత్మక ఆర్థిక ఉత్పత్తిని పరిచయం చేసేందుకు వినియోగించుకుంటుంది` అని వివరించారు.
ఎన్ఎస్ఇ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ విక్రమ్ లిమయె మాట్లాడుతూ, 'ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సికు యు.ఎస్. షేర్లలో అన్ స్పాన్సర్డ్ డిపాజిటరీ రిసీట్స్ విధానంలో లావాదేవీలను నిర్వహించ డాన్ని ప్రారంభించడం మర్చిపోలేని క్షణంగా ఉంది. ఇది భారతదేశపు రిటెయిల్ పెట్టుబడిదా రులకు గ్లోబల్ షేర్లలో పెట్టుబడి చేసే పూర్తి ప్రక్రియను నియంత్రిత పరిసరాల్లో అడ్డంకులు లేకుండా చేస్తుంది. దీన్ని ప్రారంభించడంతో మేము భారతదేశపు రిటెయిల్ పెట్టుబడిదారులు మరియు దళారులకు గమనార్హమైన విలువను వృద్ధి చేస్తున్నాము మరియు ఏకీకృతమైన అలాగే ఆవిష్కారాత్మక అంతర్జతీయ ఐఎఫ్ఎస్సి ఎక్ఛేంజ్ కేంద్రంగా మా స్థానాన్ని నిర్మించుకునేందుకు వేచి చూస్తున్నాము. ఈ వినూత్న తరహా ప్రయత్నానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మేము కలిగి గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి ఆర్థిక వలయాన్ని మార్చేందకు ప్రయత్నిస్తాము అలాగే గౌరవనీయులైన ప్రధాన మంత్రి లక్ష్యానికి అనుగుణంగా వాస్తవ గ్లోబల్ ఐఎఫ్ఎస్సి కానున్నాము` అని పేర్కొన్నారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజద్ భరూచా మాట్లాడుతూ,'హెచ్డీఎఫ్సి బ్యాంక్ భారతదేశంలో ఆర్థిక సేవల వలయంలో మార్పులు తీసుకురావడంలో అగ్రగామిగా ఉంది అలాగు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఎన్ఎస్ఇ ఐఎఫ్ఎస్సి రిసీట్స్/గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి భారతదేశంలో మొదటిది మరియు ఈ పెట్టుబడులను అత్యంత అందుబాటు ధరలో అలాగే పారదర్శకంగా ఉంచుతుండడంతో, రిటెయిల్గా లావాదేవీలను నిర్వహించేవారికి బాటను పరుస్తుంది. ఈ కార్యక్మం గురించి మేము ఉత్సుకతతో ఉన్నాము మరియు ఇది భారతదేశంలోని రిటెయిల్ పెట్టుబడిదారులు గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్లలోకి అడుగు పెట్టే విధానాన్ని మార్చనుంది` అని తెలిపారు.