Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడానికి రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కొత్తగా 'ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (పిఎల్హెచ్ఎఫ్)ను ప్రారరంభించింది. దీన్ని శనివారం హైదరాబాద్‌లో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు లాంచనంగా ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మద్దతును మరీ ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి మహేష్‌బాబు ఫౌండేషన్, ఆర్సిహెచ్ఐ కట్టుబడినట్లు ఇరు సంస్థలు పేర్కొన్నాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు కాస్త ఆర్థిక సహాయం ఉంటే డాక్టర్లుగా ఆ పిల్లలకు అతి సులభంగా తగిన చికిత్సను అందించగలమనిరెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల, పిఎల్హెచ్ఎఫ్ చైర్మెన్ డాక్టర్ చిన్నస్వామి రెడ్డి అన్నారు.