Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైతుల ఆదాయం వృద్ధి చేయడంలో భాగంగా బాంబూ పీపుల్ మరియు జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంయుక్తంగా 21 వర్క్‌షాప్‌లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా బాంబూ ప్లాంటేషన్‌తో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించింది. ఈ వర్క్‌షాప్ సిరీస్‌లో భాగంగా తొలి వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వద్దనున్న ఐసీఏఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వద్ద నిర్వహించారు.
భారత ప్రభుత్వంతో పాటుగా ప్రభావశీలురైనటువటి పాషా జీ పటేల్ (రాష్ట్ర వ్యవసాయ ధరల కమిషన్ మాజీ చైర్మెన్), సంజీవ్ కార్పీ (కోన్బాక్ డైరెక్టర్), వినోద్ లహోటీ (సీఎండీ, జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ), ఇతన సుప్రసిద్ధ వ్యక్తులైనటువంటి వై శ్రీధర్ (పూర్వ ఛాన్స్లర్ బీజెపీ), రవిపాటిల్, నీరా శర్మ(జ్యువెలరీ ఆర్టిషియన్), టీ సాయికిరణ్ రెడ్డి (ఎక్స్ ఆఫ్ ఇంజినీర్)తో పాటుగా 50 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ లహోటీ మాట్లాడుతూ 'ఇప్పుడు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా బాంబూ పంట నిలుస్తుంది. బై బ్యాక్ గ్యారెంటీ ఉండటంతో పాటుగా అతి తక్కువ పెట్టుబడి, తక్కువ లేబర్, నీరు అవసరం పడటంతో పాటుగా లాభాలూ ఎక్కువగానే ఉంటాయి. ఎకరాకు ఖచ్చితంగా 1.5-3 లక్షల ఆదాయం రైతులకు మెరుగుపడుతుంది`అని అన్నారు
పాషా జీ పటేల్ (రాష్ట్ర వ్యవసాయ ధరల కమిషన్ మాజీ చైర్మెన్) మాట్లాడుతూ 'అతి సహజంగా లభించే వనరు కావడంతో వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్‌ను ఇది సమతుల్యం చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్ధకు ఓ ఆకృతి అందించే అవకాశం ఉంది. వ్యవసాయ అడవులకు తోడ్పాటునందించడం తో పాటుగా పునరుత్పాదక వనరుల కూ తోడ్పాటు నందిస్తుంది. నీటి కోత తగ్గించడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తుంది` అని అన్నారు.
బాంబూను ఎన్నో రకాలుగా వాడుతున్నారు. ప్రధానంగా నిర్మాణ రంగం (ఫ్లోరింగ్, రూఫింగ్ డిజైనింగ్, స్కాఫోల్డింగ్), ఫర్నిచర్, ఫుడ్, బయోఫ్యూయల్, ఫ్యాబ్రిక్స్, క్లాత్, పేపర్,పల్ప్, బొగ్గు, అలంకరణ గార్డెన్ ప్లాంటింగ్, తదితర కారణాల వల్ల అధికంగా వాడుతున్నారు.