Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిల్ & గ్లేడ్ ఆవిష్కారం
ముంబై: హోం బెడ్డింగ్ విభాగం అవసరాలను తీర్చేందుకు తన ఫ్లాగ్ షిప్ బ్రాండ్ హిల్ & గ్లే డ్ ఆవిష్కారంతో బిర్లా సెంచురీ హోమ్ డివిజన్ భారతీయ టెక్స్ టైల్ మార్కెట్ ను సుసంపన్నం చేయ నుంది. హిల్ & గ్లేడ్ బై బిర్లా సెంచురీ ఇప్పటికే పలు దేశాల్లో గుర్తింపు పొందింది. కొనుగోలుదారుల అభి రుచులకు అనుగుణంగా రంగులు, నాణ్యతలో ఎన్నో ఎంపికలను ఇది అందించనుంది.
ముంబైలో హిల్ & గ్లేడ్ బై బిర్లా సెంచురీ ఆవిష్కరణ సందర్భంగా సీనియర్ ప్రెసిడెంట్, హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్.కె. దాల్మియా మాట్లాడుతూ, నాణ్యతతో పాటుగా పర్యావరణహితానికి పెద్దపీట వేయాల్సిన అవస రాన్ని నొక్కిచెప్పారు. ‘‘పర్యావరణహితం అనేది ఇప్పుడేదో సరికొత్త బజ్ వర్డ్ గా మారిపోయినా, బిర్లా సెం చురీ మాత్రం స్థాపించిన నాటి నుంచి కూడా అదే బాటలో పయనిస్తోంది. నేలతల్లిని కాపాడుకోవడం అనేది అత్యంత ముఖ్యమైంది. ‘ఈ రోజే ఆలోచించు, రేపటి గురించి’ అనేది మేం తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, చిన్నపాటి అంశాలకూ, తిరుగులేని నాణ్యత ప్రమాణాలకూ ప్రాధాన్యం ఇస్తూ కొనుగోలుదారులు ఎంతగానో ఇష్టపడే మన ఉత్పాదనల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది’’ అని అన్నారు.
ముంబైలో ఈ ఆవిష్కరణ సందర్భంగా బిర్లా సెంచురీ సీఎంఒ (హోమ్ టెక్స్ టైల్ అండ్ అపెరల్ ఫ్యాబ్రిక్స్) ఆశిష్ మెహ్రిశి మాట్లాడుతూ, 2022లో చక్కటి ఆదరణ పొందిన బ్రాండుల్లో ఒకటిగా హిల్ & గ్లేడ్ నిలువ గలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘హోమ్ బెడ్డింగ్ విభాగంలో ఉన్న అంతరాలను భర్తీ చేసేందుకు కట్టుబడిన లక్ష్యిత వినియోగదారుల నుంచి పొందిన ఫీడ్ బ్యాక్ తో మేం గణనీయ కాలాన్ని, పరిశోధనను దీనిపై వెచ్చించాం. టెక్చ్సర్స్, రంగులు, నాణ్యతలో పలు ఎంపికల ను హిల్ & గ్లేడ్ కొనుగోలుదారులకు అందిస్తుంది’’ అని అన్నారు.
వివిధ రంగుల్లో అందరినీ ఆకట్టుకునేలా 250 డిజైన్లను హిల్ & గ్లేడ్ ఆవిష్కరించనుంది. ఈ ప్రింట్స్ కొనుగోలుదారులను అమితంగా ఆకర్షిస్తాయి. టెస్ట్ ఆడియన్స్ తో వినియోగదారుల ప్రాథమ్యాలపై నెలల తరబడి నిర్వహించిన విస్తృత అధ్యయనాల ప్రాతిపదికన ఇవి రూపుదిద్దుకున్నాయి. అత్యంతగా ఇష్టపడే, బాగా సూట్ అయ్యే బెడ్ షీట్స్ చాయిస్ లను ఫైన్ ట్యూన్ చేసేందుకు ఇవి మాకు సాయపడ్డాయి.
నాలుగు విభిన్న నాణ్యతల్లో బేసిక్, ఎసెన్షియల్, ప్రీమియం, గ్రాండియర్ లను వరుసగా 160,210, 300,400 త్రెడ్ కౌంట్స్ లో హిల్ & గ్లేడ్ అందిస్తుంది. కాటన్ బెడ్ షీట్స్ యావత్ శ్రేణి కూడా ఇంతకు ముందెన్నడూ చూడని ప్రత్యేకతను తిరుగులేని నాణ్యతా ప్రమాణాలతో అందిస్తుంది. బాత్ టవల్స్ కు సంబంధించి హ్యాండ్ టవల్స్, ఫేస్ టవల్స్, బాత్ టవల్స్ వంటి ఆప్షన్లను కూడా హిల్ & గ్లేడ్ కొనుగోలుదారులకు అందిస్తుంది. హోమ్ బెడ్డింగ్ విభాగానికి అనుబంధంగా ఇది ఉంటుంది. టవల్స్ లో అధిక నాణ్యమైన ఎంపికలను ఇది కొనుగోలుదారులకు అందిస్తుంది. బిర్లా సెంచురీ అందించే నాణ్యతను భారతదేశ భిన్నరకాల ప్రజానీకంతో మిళితం చేసే ప్రయాణంలో భాగంగా హిల్ & గ్లేడ్ ఈ ఏడాదిలోనే వివిధ రకాల ఎత్నిక్ బెడ్ షీట్స్ ను అందించనుంది. అంతర్జాతీయ టెక్స్ టైల్ వేదికపై భారతదేశ గ్రామీణ అందాలకు ఇదో చక్కటి ప్లాట్ ఫామ్ కానుంది. ప్రచార కార్యక్రమాలన్నీ కూడా పర్యావరణ హితం ఆధారితంగా ఉంటాయి. భారతదేశ కీర్తిని ఇనుమడింపజేసే ఆశయంతో కూడుకున్నవిగా ఉంటాయి.
బిర్లా సెంచురీ అందించే ప్రతి ఉత్పతి కూడా వినూత్నత, పర్యావరణహితంతో ముడిపడి, పటిష్ఠమైన విని యోగదారు కేంద్రిత ధోరణితో ఉంటాయి. నాణ్యతతో ఎన్నడూ రాజీపడవు. సంస్థ జీరో కాంప్రమైజ్ ధోరణిని అనుసరిస్తుంది. అంటే ప్రతి ప్రక్రియ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అత్యాధునిక మెషినరీ సాయం తో ఉంటుంది.
స్పీడ్, వెర్సాటిలిటీ, నాణ్యతతో తయారీ సాంకేతికత అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహాలో వాటికి సమానంగా లేదా అంతకు మించిన విధంగా ఉంటుంది. ఈ సంస్థ విశిష్టత ఏమిటంటే, ఆయా ఉత్పాదన లకు సంబంధించి నేత, డిజైన్, టెక్చ్సర్ పరంగా అది అందించే కస్టమైజేషన్.
భారతదేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విస్తృత నెట్ వర్క్ తో ఇది ప్రతీ కొనుగోలుదారుకు కూడా ఆయా ఉత్పా దనలను చేరువలోకి తీసుకెళ్తోంది. ప్రతి అడుగులోనూ ఆశయం ఒక్కటే. బిర్లాపై నమ్మకం ఉంచే కస్టమ ర్లకు అత్యుత్తమ ఉత్పాదనలను బిర్లా సెంచురీ అందిస్తుంది.