Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిలీ : నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఇ) మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఏడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను ఆదివారం సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టు కస్టడీకి అనుమతించింది. అయితే సిసిటివి పర్యవేక్షణలోనే చిత్రాను విచారించాలని ఆదేశించింది. ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజూ సాయంత్రం కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించింది. కాగా.. ఈ కేసులో కీలక సూత్రదారి, అజ్ఞాత యోగి అయినా ఆనంద్ సుబ్రమణియన్‌తో గతంలో తనకున్న సంబంధాన్ని వెల్లడించేందుకు చిత్ర నిరాకరిస్తున్నారని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఆ యోగిని తాను గుర్తించడానికి నిరాకరిస్తున్నారని వెల్లడించాయి.