Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1491 పాయింట్లు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బేర్ గుప్పిట్లోనే కొనసాగు తున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ కుప్పకూలాయి. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలు, చమురు మంట, ద్రవ్యోల్బణ సెగలు మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ సమయంలో మదుపర్లు మొత్తంగా రూ.11.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సోమవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లు పైగా నష్టంతో 52,367 కనిష్టానికి పడిపోగా.. తుదకు ఈ సూచీ 1,491 పాయింట్లు లేదా 2.74 శాతం పతనమై 52,843కు జారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ ఇంట్రాడేలో 15,711 పాయింట్లకు దిగజారి.. తుదకు 382 పాయింట్లు నష్టపోయి 15,863 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2.2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇలో 2,601 స్టాక్స్ నేల చూపులు చూడగా.. మరో 857 సూచీలు స్వల్ప లాభాలు నమోదు చేశాయి. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్సీయల్ సర్వీసెస్ రంగాలు 4 శాతం నుంచి 5.5 శాతం మేర విలువ కోల్పోయాయి.