Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీ జీవితాన్ని సుసంపన్నం చేసిన మహిళలకు ప్రత్యేక అనుభూతిని కలిగించడం ద్వారా ఈ మహిళా దినోత్సవానికి ఆచరించుకోండి. మీరు వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అవకాశం లేని వారిని మీ తరపున మేము కవర్ చేస్తాము. ఉబర్ కనెక్ట్ ద్వారా ‘ప్యాకేజీ’ డెలివరీని బుక్ చేసుకునేందుకు మరియు నగరంలో ఎక్కడికైనా మీ బహుమతిని పంపించేందుకు మీకు ఉబర్ యాప్ ఉంటే సరిపోతుంది. ఇష్టమైన పుస్తకమైనా, పువ్వులైనా లేదా చాక్లెట్ల బాక్సయినా- పంపిస్తూ మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని, మీ జీవితంలో వారెంత ప్రత్యేకమో తెలియజేయండి. మహిళల కోసం నిర్దేశించిన ఈ ప్రత్యేక దినోత్సవం నాడు, మేము ఉబర్ యాప్‌లోని అన్ని రూట్లను ఒక రోజుకు పరిమితం అయ్యేలా ఊదా (పర్పుల్) రంగుకు మారుస్తాము! పర్పుల్ రంగుకు సుదీర్ఘ చరిత్ర ఉంది మరియు ఉబర్ యాప్‌లో లింగ సమానత్వం, పర్పుల్ రూట్లను సాధించే ప్రయత్నాలకు అనుబంధం ఉంది అలాగే ఉబర్ రైడర్లకు ఈ ప్రత్యేక రోజును సున్నితంగా గుర్తు చేయడం ద్వారా, వారు తమ జీవితాలపై ప్రభావం చూపించిన మహిళలతో వేడుక జరుపుకునేందుకు ప్రేరణ అందిస్తున్నాము. కనుక, ఒక స్నేహితురాలు, ఉపాధ్యాయురాలు, తల్లి, గురువు, శ్రేయోభిలాషి లేదా అంతకంటే ఎక్కువ మంది కావచ్చు - ముందుకు సాగండి మరియు వారికి ఉబర్‌తో ప్రత్యేక అనుభూతిని అందించండి.
ఉబర్ కనెక్ట్‌ను బుక్ చేసేందుకు దశలు:
1. మీ ప్యాకేజీని సిద్ధం చేసి, దాన్ని జాగ్రత్త పరచండి
2. ఉబర్ యాప్‌లో ‘ప్యాకేజీ’ని ఎంచుకోండి, నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి. మీ ప్యాకేజీలో నిషేధిత ఉత్పత్తులు లేవని నిర్ధారించండి మరియు డెలివరీని కోరండి.
3. అందుకునే వారి పేరు మరియు మొబైల్ ఫోన్ నంబర్ మరియు మీ డ్రైవర్‌కు ఏదైనా ప్రత్యేక డెలివరీ సూచనల కోసం మీరు ఉబర్ యాప్‌లో అందుకునే సందేశానికి బదులు ఇవ్వండి
4. మీ లొకేషన్లో డ్రైవర్ని కలవండి మరియు మీ ప్యాకేజీని డ్రైవర్‌కి అప్పగించండి*
5. ప్యాకేజీని అందుకునేందుకు డ్రైవర్‌ను కలవమని దాన్ని అందుకునే వ్యక్తికి చెప్పండి.
మహమ్మారి సమయంలో డోర్-టు-డోర్ ప్యాకేజీ డెలివరీ సర్వీస్‌లను అందించేందుకు ఉబర్ కనెక్ట్‌ను ప్రారంభించారు. గత కొన్ని నెలల్లో ఈ సేవలు ఏడు రెట్లు వృద్ధి చెందింది. మీ ప్యాకేజీని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సురక్షితంగా మరియు భద్రతలతో పంపించేందుకు మీ జీవితాన్ని మరింత సరళీకృతం చేసేందుకు సహాయపడటమే దీని లక్ష్యం. బేకరీ ఉత్పత్తులు, హోమ్ ఫుడ్ మరియు ఫ్లవర్లు ఉబర్ కనెక్ట్ ద్వారా తరచుగా డెలివరీ చేస్తున్న ఉత్పత్తుల్లో అధికంగా ఉన్నాయి. ఉబర్ కనెక్ట్ ద్వారా పంపిస్తున్న అన్ని ప్యాకేజీలు ద్విచక్ర వాహనంపై రవాణా చేయదగినవి, 5 కిలోల కన్నా తక్కువ బరువు, సురక్షితంగా సీలు చేయబడాలి. మద్యం, నిర్బంధిత ఔషధాలు లేదా ప్రమాదకరమైన మరియు చట్టవిరుద్ధమైన వస్తువులు తదితర నిషేధిత వస్తువులు ప్యాకేజ్‌లో ఉండకూడదు. నిషేధించబడిన వస్తువుల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. ఆన్-డిమాండ్ ట్రిప్‌ల తరహాలో, మీరు పికప్ చేసేందుకు ముందు, మార్గంలో మరియు డ్రాప్-ఆఫ్ వద్ద ట్రిప్ పురోగతిని పర్యవేక్షించుకునేందుకు అవకాశం ఉంది. మీరు ప్యాకేజీ అందుకునే వారితో డెలివరీ స్థితిగతులనూ పంచుకోవచ్చు.