Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బెంగళూరులో తొలి వారం టెస్ట్ రైడ్స్ విజయవంతంగా ప్రారంభమైన తరువాత, బౌన్స్ ఇన్ఫినిటీ ఇప్పుడు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 కోసం నాలుగు కీలక నగరాలలో టెస్ట్ రైడ్స్‌ను ప్రారంభించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కస్టమర్ రైడ్స్ ఇప్పుడు ముంబై, పూనె, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్లు ఈ నగరాలో బహుళ టచ్ పాయింట్ల వద్ద లభ్యంకానున్నాయి. వీటితో పాటుగా స్మార్ట్ స్కూటర్లను తక్షణమే బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.ఆసక్తి కలిగిన వినియోగదారులు తమ టెస్ట్ రైడ్ స్లాట్లను బౌన్స్ ఇన్ఫినిటీ వెబ్సైట్ https://bounceinfinity.com/వద్ద నమోదు చేసుకోవచ్చు.
బెంగళూరులో నిర్వహించిన తొలి వారపు టెస్ట్ రైడ్‌లో 2900 మంది రైడ్ చేయగా వారిలో 55% మంది ముందస్తు డెలివరీల కోసం బుకింగ్ చేసుకున్నారు. రాబోయే కొద్ది వారాలలో మరిన్ని నగరాలలో ఈ టెస్ట్ రైడ్లను నిర్వహించనుంది. ఇటీవలనే విడుదల చేసిన తమ వినియోగదారుల విద్యుత్ స్కూటర్ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1కు అనుగుణంగా తమ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను సైతం గణనీయంగా వృద్ధి చేయాలని బౌన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూటర్‌ను డిసెంబర్ 02వ తేదీ విడుదల చేశారు. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అవకాశంతో వస్తుంది. భారతదేశపు మార్కెట్లో ఈ తరహా సేవలు తొలిసారి. ఈ సేవలతో నిర్వహణ ఖర్చులు గణనీయంగా అంటే సంప్రదాయ స్కూటర్లతో పోలిస్తే 40% వరకూ తగ్గుతాయి. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1ను బ్యాటరీతో కూడా అందిస్తారు. దీనిని స్కూటర్ నుంచి తొలగించి తమ ఇల్లు లేదా ఆఫీస్ లేదంటే తమకు సౌకర్యంగా ఉండే మరెక్కడైనా వినియోగదారులు చార్జ్ చేసుకోవచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లు అత్యంత ఆసక్తికరంగా ఐదు రంగులు ''స్పోర్టీ రెడ్, స్పార్ల్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డీశాట్ సిల్వర్, కొమెట్ గ్రే ఉన్నాయి. ప్రీ బుకింగ్స్ నేడు ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఏప్రిల్ 2022లో ప్రారంభం కానున్నాయి. ఇది 50వేల కిలోమీటర్లు, మూడు సంవత్సరాల వారెంటీతో వస్తుంది.