Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ నేడు పాల పరిశ్రమకు తోడ్పాటునందిస్తున్న మహిళా రైతులను సత్కరించింది. షాద్నగర్, చేవెళ్ల రోడ్ వద్దనున్న సిద్స్ ఫార్మ్ పాల ఉత్పత్తి కేంద్రం వద్ద జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో నూతన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కూడా మహిళలకు అందించింది. బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులైనటువంటి పాల పరిశుభ్రత, పశువుల ఆరోగ్యం, తగినంతగా దాణా సరఫరా చేయడం, తగినంతగా నీరు అందించడం తోపాటుగా పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్ధలు, వ్యర్థ నిర్వహణ వ్యవస్ధలను సైతం వెల్లడించింది. తాము కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి నాణ్యతను నిర్వహించడంలో మహిళా రైతులు అందించిన తోడ్పాటును సిద్స్ ఫార్మ్ గుర్తించింది. యాంటీ బయాటిక్, హార్మోన్లు, ఇతర నిల్వ కారకాలు జోడించని పాలను సిద్స్ ఫార్మ్ అందిస్తుంది.
ఈ సందర్భంగా సిద్స్ ఫార్మ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘పాల పరిశ్రమలో మహిళా రైతులు అందిస్తున్న తోడ్పాటును నేను అభినందిస్తున్నాను. మహిళా దినోత్సవ వేళ వారికి నా కృతజ్ఞతలు వెల్లడిస్తున్నాను’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘మహిళలకు మరిన్ని నైపుణ్యాలను అందించడాన్ని నేనెప్పుడూ విశ్వసిస్తుంటాను. మహిళలకు తగిన విద్యనందిస్తే మొత్తం సమాజాన్ని విద్యావంతం చేస్తారని నమ్ముతున్నాను. భవిష్యత్లో కూడా ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నాం’’ అని అన్నారు.