Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: హెచ్డీఎఫ్సి బ్యాంకు భారతదేశంలో 2022లో యూరోమనీ ప్రైవేటు బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సమీక్షలో మరోసారి భారతదేశంలో శ్రేష్ఠతకు ప్రాధాన్యతను దక్కించుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారతదేశంలో అత్యంత శ్రీమంతమైన వినియోగదారుల (100కె డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల) సంపదకు సంబంధించిన సేవల్లో అత్యుత్తమ ప్రైవేటు బ్యాంకింగ్ సేవలు అందించినందుకు పురస్కారాన్ని దక్కించుకుంది.
జాగతిక సంపద నిర్వహణ వ్యాపారంలో గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వే అగ్రగామి కొలమానం కాగా, ప్రైవేటు బ్యాంకింగ్‌లో నాణ్యత సేవల పరిశీలనను ప్రాంతం మరియు సేవా రంగాలను ఎంపిక చేసి నిర్వహిస్తోంది. ఇది 13 వివిధ ఉత్పత్తులు మరియు వినియోగదారుల రకాలకు సంబంధించిన పరిధిని కలిగి ఉంది. ఈ సమీక్ష ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు బ్యాంకర్లు మరియు వెల్త్ మేనేజర్లు అందించిన సమాచారం ఆధారంగా ఉండగా, వారు ఏ సంస్థను తమ స్థానిక మార్కెట్లో ప్రత్యర్థి అని పరిగణిస్తారో దాన్ని గుర్తిస్తారు. ఈ విధానానికి సంబంధించిన తీరు తెన్నుల గురించి మరింత తెలుసుకునేందుకు 2022 యూరోమని ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వే ఇప్పుడు 19వ ఏడాదిలో అడుగు పెట్టింది. ఈ ఏడాది యూరోమని 2,058 మౌలిక ప్రతిస్పందనలను అందుకుంది.