Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (సీఎల్ఐ) తన నాయకత్వ మార్పుల్లో భాగంగా ఇండియా బిజినెస్ పార్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్గా శ్రీ గౌరి శంకర్ నాగభూషణాన్ని నియమించింది. ఈ నియామకం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన గౌరీశంకర్, శ్రీ వినమ్ర శ్రీవాత్సవ స్థానంలోకి వస్తారు. శ్రీవాత్సవ సింగపూర్ లోని కేపిటల్యాండ్ గ్రూప్‌లో కొత్త బాధ్యతలు చేపడతారు.
సీఎల్ఐ ఇండియా లాజిస్టిక్స్ వ్యాపారం అసెండాస్-ఫస్ట్ స్పేస్‌లో గతంలో ఇన్వెస్ట్మెంట్ హెడ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గౌరీశంకర్, ఇప్పుడు సీఎల్ఐ ఇండియా బిజినెస్ పార్క్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్న బెంగళూరు నుంచి కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. ఆయన సీఎల్‌ఐకి చెందిన ఇండియా బిజినెస్ పార్క్స్ కార్యకలాపాలు, పెట్టుబడులు, అభివృద్ధి, అసెట్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఫండ్ మేనేజ్మెంట్ సహ దేశంలో సంస్థ ఆస్తుల పొర్టుఫోలియో పెరిగేలా చూస్తారు. భారత్‌లో సీఎల్ఐ వ్యాపారాలను పర్యవేక్షించే ఫండ్ మేనేజ్మెంట్ సీఈఓ స్రీ జొనాథన్ యాప్ మాట్లాడుతూ, “క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు భారత్ ప్రధాన మార్కెట్. ప్రముఘఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా మా వృద్ధి వ్యూహంలో భాగంగా మేము చేపట్టబోయే విస్తరణకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలుగా గౌరి శంకర్ మా సంస్థలో ఉన్నారు. భారత్‌లో మా లాజిస్టిక్స్ వ్యాపార ప్రారంభం, విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రైవేట్ ఈక్విటీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఫండ్ మేనేజ్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాల్లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. కంపెనీ తదుపరి దశ వృద్ధి, వాటాదారులకు విలువ అందించేందుకు నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తారని మేము నమ్ముతున్నాం. భారత వ్యాపారంలో గణనీయమైన తోడ్పాటు అందిస్తూ ఇటీవల కాలంలో విజయవంతంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించిన వినమ్రకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొత్త బాధ్యతల్లో రాణించాలని శుభాకాంక్షలు చెప్తున్నాం” అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన గౌరీ శంకర్, సింగపూర్, భారత్, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అసెంచర్, డెలాయిట్, సాంబా ఫైనాన్షియల్ గ్రూప్, టీఎఐబీ బ్యాంక్‌ల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.