Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీ బెటర్.కామ్ మరో 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ సీఈఓ విశాల్ గార్గ్ కరోనా కాలంలో జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి అబాసు పాలయ్యారు. తాజా నిర్ణయంతో అమెరికా, భారత్లో పనిచేస్తున్న మరో 3,000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. పొదుపు చర్యలో భాగంగా ఉద్యోగులను తొలగించినట్లు బెటర్ డాట్ కాం తాత్కాలిక అధ్యక్షుడు కెవిన్ ర్యాన్ పేర్కొన్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా క్యాపిటల్లో తగ్గుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలగించబడిన సిబ్బందికి కనీసం 60 పని దినాలు లేదా 80 పనిదినాల వరకు నగదు చెల్లింపులు చేయనున్నామన్నారు.