Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్‌కు 1200 పాయింట్ల లాభం
ముంబయి : వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ ప్రకటించడంతో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. ఇక యుద్ధం ఆగిపోవచ్చనే అంచనాలకు తోడు పలు ఇతర సానుకూల అంశాలతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,223 పాయింట్లు లేదా 2.3 శాతం పెరిగి 54,647కు చేరింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 332 పాయింట్లు రాణించి 16,345 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇరు సూచీలు 54,894, 16,418 గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ.. ఐరోపా దేశాలు మాత్రం దిగుమతిని కొనసాగించడానికే మొగ్గు చూపడం సానుకూలాంశం. నేడు గురువారం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి అనుకూల ఫలితాలు ఉండొచ్చన్న ఊహాగానాలు మార్కెట్లకు కలిసివచ్చాయని బ్రోకర్లు తెలిపారు.