Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేళ్లలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్ : పర్యావరణ నిర్వహణ సేవల వ్యాపారంలో ఉన్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ తన బ్రాండ్ పేరును ఆర్ఇ సస్టెయినబిలిటీగా మార్చు కుంది. ఈ కొత్త లోగోను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆర్ఈ సస్టెయినబిలిటీ సీఈఓ, ఎండి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లుగా ఈ రంగంలో అనేక వినూత్నలతో ముందుకు సాగామన్నారు. నూతన బ్రాండ్‌తో తమను తాము కొత్త వరవడిని సృష్టించుకోవడంపై దృష్టి పెడుతున్నామన్నారు. వచ్చే మూడేండ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో కెకెఆర్ గ్రూపునకు 60 శాతం, అయోద్య రామిరెడ్డి కుటుంబానికి 40 శాతం చొప్పున వాటాలున్నాయన్నారు. ప్రస్తుతం ఏడాదికి 75 లక్షల టన్నుల వేస్ట్ మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. వచ్చే మూడేండ్లలో దీన్ని 1.5 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3వేల కోట్ల టర్నోవర్‌తో రూ.550 కోట్ల లాభాలు సాధించామన్నారు. ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మల్లిక్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 85 ప్రాంతాల్లో, అంతర్జాతీయంగా సింగపూర్, యూఏఈ, ఖతార్, సౌదీ అరెబియా, అమెరికా తదితర దేశాల్లో కార్యకలాపాలు కలిగి ఉన్నామన్నారు. ఇక దక్షిణ, తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విస్తరణపై దృష్టి పెడుతున్నామన్నారు.