Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· దక్షిణ భారతదేశంలో నివశిస్తోన్న 58% మంది స్పందనదారులు ఒకవేళ తాము అకస్మాత్తుగా మరణిస్తే జీవిత భీమా కాపాడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో దాదాపు 57% మంది ఒకవేళ అనారోగ్యం బారిన పడితే తమ కుటుంబ ఆదాయం వృద్ధి చెందడంలో భీమా సహాయపడుతుందని భావిస్తున్నారు.
· ఆర్ధిక భద్రతా ఉపకరణంగా జీవిత భీమాను అన్ని వయసుల స్త్రీ, పురుషులులిరువురూ ఒకేలా గుర్తిస్తున్నారు.
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) ఇటీవలనే భారతదేశ వ్యాప్తంగా 40 నగరాలలో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దాదాపు 12వేల మంది ప్రజలపై చేసిన ఈ అధ్యయనం ద్వారా జీవిత భీమా పట్ల భారతీయుల ధృక్పథం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయన ఫలితాలు ఎల్ఐసీ యొక్క ప్రజా అవగాహన కార్యక్రమాలు., సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్
(అన్నిటి కన్నా ముందు జీవిత భీమా)ను పునరుద్ఘాటించడంతో పాటుగా కుటుంబంలో సంపాదనాపరుల తొలి ప్రాధాన్యతగా జీవిత భీమా ఉందనే వెల్లడైంది. భారతదేశంలోని 24 జీవిత భీమా కంపెనీల ఉమ్మడి ప్రయత్నాలకు ఈ ప్రచారం ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా ప్రపంచంలో అతితక్కువ భీమా ఉన్న వ్యక్తులను కలిగిన దేశంలో భీమా పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం ప్రజలలో అవగాహన పెరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు జీవిత భీమాను అతి ముఖ్యమైన ఆర్ధిక ఉపకరణంగా భావిస్తున్నారు. జీవిత భీమాను కొనుగోలు చేయడం ఎందుకు అవసరం అనే అంశాల పట్ల తమ నమ్మకాలను అధికశాతం మంది స్పందనదారులు వెల్లడించారు. వాటిలో దురదృష్టరన సంఘటనల వేళ రక్షణ, భవిష్యత్‌కు ఆర్థిక భద్రత, కుటుంబ ఆర్థిక లక్ష్యాల చేరిక వంటివి అధికంగా ఉంటున్నాయి. మొత్తం స్పందనదారులలో 70% మంది జీవిత భీమాను తీసుకోవడానికి ఆసక్తిని కనబర్చడం జరిగింది. నిజానికి కోవిడ్–19 మహమ్మారి కారణంగా అధిక సంఖ్యలో వ్యక్తులు భీమా తీసుకున్నారు. అయితే, ఇప్పటికీ భీమా స్వీకరణ పరంగా అంతరం మాత్రం అధికంగా ఉంది. జీవిత భీమా కొనుగోలు ఆవశ్యకత పట్ల అవగాహన మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దాదాపు 91% మంది జీవిత భీమా తీసుకోవడం అవసరమే అని చెబుతున్నారు కానీ కేవలం 70% మంది మాత్రమే దీనిని తీసుకోవాలనుకుంటున్నారు.
భారతదేశపు దక్షిణ ప్రాంతంలో జీవితభీమా పట్ల ఆసక్తి తక్కువగానే ఉంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 64% మంది మాత్రమే జీవిత భీమా ఆవశ్యకత గుర్తిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇది 78%గా ఉంది. దక్షిణాదిలో ఎందుకు ఆసక్తి కనబరచడం లేదంటే వీరు ఇతర ఆర్థిక వనరులు అయినటువంటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆరోగ్య భీమా లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలతో పోలిస్తే జీవిత భీమా తీసుకున్నవారు దక్షిణాదిలో తక్కువ. ఈ విభాగాలలో వీరి ఆసక్తి అధికంగా ఉంది. విభిన్న ప్రాంతాల వ్యాప్తంగా కొనుగోలుమాధ్యమాల పరంగా ఈ వైవిధ్యత కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను అధికంగా వినియోగిస్తున్నారు . దాదాపు60%కు పైగా ప్రజలు ఒకటి లేదంటే అంతకు మించిన డిజిటల్ వాలెట్లను వినియోగిస్తున్నారు.
‘‘మేము ఈ అధ్యయనాన్ని ప్రధానంగా జీవిత భీమా పట్ల ప్రజల భావనలు, అవగాహన, ప్రాచుర్యం తెలుసుకునేందుకు నిర్వహించాము. భారతదేశంలో సంపాదించే ప్రతి వ్యక్తి భీమాను అత్యున్నత ప్రాధాన్యతాంశంగా మలుచుకోవాలన్నది మా లక్ష్యం. తద్వారా సురక్షితమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను తమ కుటుంబం కోసం అందించగలరు. సంరక్షణ, బాధ్యత అనేవి ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయి. మేము ఈ ఆలోచనా ధోరణి మార్చాలనుకుంటున్నాము. భారతీయులకు అవగాహన కల్పించాలను కుంటున్నాము. తద్వారా మేము అత్యుత్తమ జీవిత భీమా పరిష్కారాలు అందించగలము’’ అని ఎస్ఎన్ భట్టాచార్య, సెక్రటరీ జనరల్ , లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అన్నారు.
అదనంగా, పలు ఆసక్తికరమైన ధోరణులు సైతం ఈ అధ్యయనం నుంచి కనుగొనబడ్డాయి. దీనిద్వారా ప్రజలకు జీవిత భీమా ఆవశ్యకత పట్ల మరింత అవగాహన కలిగిందనేది తెలుస్తుంది.
o అన్ని ఇతర ఆర్థిక ఇన్స్ట్రుమెంట్స్ నడుమ – జీవిత భీమా పట్ల అందరిలోనూ ఒకే తరహా అవగాహన దాదాపుగా కనిపిస్తుంది. ఇది దాదాపు 96%గా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ (63%) లేదా ఈక్విటీ షేర్లు (39%) ఉంటున్నాయి.
o ఆర్ధిక ఉపకరణంగా జీవిత భీమా ఆవశ్యకత మాత్రం స్త్రీ, పురుషులు మరియు వయసులతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒకే తరహా భావన ఉంది.
o యువతతో పోలిస్తే 36 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అధికంగా జీవిత భీమా కలిగి ఉన్నారు.
o అధ్యయనంలో పాల్గొన్నవారిలో దాదాపు సగం మంది జీవిత భీమాను భీమా ఏజెంట్ వద్ద కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతి 10 మందిలో ముగ్గురు బ్యాంకుల వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
o యువకులు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా జీవిత భీమా పాలసీలు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఆన్లైన్లో తమకు బహుళ ప్రయోజనాలు లభ్యమవుతాయని, ప్రయోజనాలు, ప్రీమియం చెల్లింపు పరంగా రాయితీలు లభిస్తాయని భావిస్తున్నారు.
o దాదాపు సగం మంది (47%) మొత్తం స్పందన దారులు తాము లేదంటే తమ కుటుంబంలో ఒకరు జీవిత భీమా పొంది ఉన్నామని, దీని గురించి తమకు ఎంతో తెలుసని వెల్లడిస్తున్నారు.
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం జీవిత భీమా పెట్టుబడులు స్వాభావరీత్యా దీర్ఘకాలం కొనసాగించబడతాయి మరియు ఖరీదైనవనే అభిప్రాయం ఉందని అధ్యయనం వెల్లడించింది. జీవిత భీమా స్వీకరణకు ప్రధానంగా రెండు అవరోధాలు కనిపిస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ అధ్యయనం ద్వారా సబ్ సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రచారం ద్వారా కేవలం జీవిత భీమా ఆవశ్యకత పట్ల అవగాహన మాత్రమే కాదు, ఉత్పత్తులు, విభాగాలు అంటూ ప్రజలకు తప్పుదోవ పట్టించే అంశాల పట్ల కూడా అవగాహన కలిగించడం సాధ్యమవుతుంది. తమతో పాటుగా తమ కుటుంబాలకు సురక్షితమైన, మెరుగైన భవిష్యత్ అందించడానికి మాత్రం జీవిత భీమాను సరైన కోణంలో స్వీకరించడం అత్యంత కీలకం.
అధ్యయనం గురించి :
· ఈ నివేదికను హన్సా రీసెర్చ్ తో భాగస్వామ్యం చేసుకుని చేశారు
· 25–55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు అధ్యయనంలో పాల్గొన్నారు.
· ఎంపిక చేసిన నగరాల్లో 8 మెట్రో నగరాలు, 9 టియర్ ఒన్ నగరాలు, 23 టియర్ 2 పట్టణాలు ఉన్నాయి
· ఈ అధ్యయనంను 12వేల మంది స్పందనదారులతో చేశారు.