Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్మన్ మూలాలు కలిగిన ఆడియో-విజువల్ బ్రాండ్, బ్లావ్‌పుంక్ట్ టీవీ, రెండు మోడళ్లలో 40-వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది
· 40-అంగుళాల హెడ్డి మరియు 43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి టీవీ ఉత్పత్తులు, మార్చి 12-16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ : భారతదేశంలో గత ఏడాది బ్లావ్‌పుంక్ట్ స్మార్ట్ టీవీలను విజయవంతమైన విక్రయాలను ప్రారంభించిన తర్వాత, జర్మనీ మూలాలు కలిగిన ఈ ఆడియో-విజువల్ బ్రాండ్ తన ఉత్పత్తుల శ్రేణికి రెండు కొత్త ప్రీమియం మోడళ్లు 40-అంగుళాల హెచ్డీ రెడీ మరియు 43 అంగుళాల హెచ్‌హెచ్‌డి టీవీని జోడించింది. భారతదేశంలో ఈ ఉత్పత్తుల శ్రేణి వరుసగా రూ.15,999 మరియు 19,999 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఈ ఉత్పత్తులను భారతదేశపు అతిపెద్ద టీవీల తయారీదారు ఎస్పిపిఎల్ (SPPL) డిజైన్ చేసి, తయారు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా 12-16 మార్చి 2022 వరకు నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ బ్రాండ్ గత సంవత్సరం, భారతీయ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL)తో ప్రత్యేక సహకారంతో ఏడు “మేడ్ ఇన్ ఇండియా” స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో బ్లావ్‌పుంక్ట్ కోసం ఎస్పిపిఎల్ బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, రిటైల్ సప్లయ్ చైన్ ప్రక్రియను చేపట్టేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సరమైన ధరల్లో హైఎండ్ టీవీలను అందించే దిశలో 40-అంగుళాల మోడల్ ధర రూ.15,999 మరియు 43-అంగుళాల టీవీ మోడల్ ధర రూ.19,999లకు అందుబాటులోకి తీసుకురాగా, ఇవి 1జిబి రామ్, 8 జిబి రోమ్, 3 హెచ్డిఎంఐ పోర్టులు మరియు 2 యూఎస్బి పోర్టులకు మద్దతు ఇస్తాయి. వినియోగదారులు ప్రతి దృశ్యాన్ని షార్ప్ వివరాలు మరియు స్పష్టమైన రంగులలో ఆస్వాదించేలా ఈ మోడల్‌లు హెచ్‌డిఆర్ 10తో వస్తాయి. వీటిలో 2 స్పీకర్లు, డిజిటల్ నాయిస్ ఫిల్టర్ మరియు సరౌండ్ టెక్నాలజీలకు మద్దతు ఇచ్చే 40-వాట్ స్పీకర్ అవుట్‌పుట్, లోతైన సరౌండ్ సౌండ్‌తో లీనమయ్యే శ్రవణ అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా, వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వివిధ యాప్‌లు మరియు గేమ్‌లను ఆడుకోవచ్చు. వీటన్నింటిని అందుకునేందుకు, వినియోగదారులు రిమోట్లో సింగిల్ టచ్ ద్వారా ఆమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మరియు సోనీ లివ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
వినియోగదారులు 32-అంగుళాల టీవీ ధరలో 400 నిట్స్ బ్రైట్నెస్ మరియు అల్ట్రా-థిన్ బెజెల్‌ను, 40-అంగుళాల టీవీలో విలక్షణమైన ఆడియో-విజువల్ సినిమాటిక్ అనుభవాన్ని అందుకుంటారు. అలాగే, 40-అంగుళాల టీవీ ధరతో సమానంగా వంపులు లేని 43-అంగుళాల టీవీ, 500 నిట్ల బ్రైట్నెస్ మరియు ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, బ్రాండ్ తన విక్రయాలను ప్రారంభించినప్పటి నుంచి రికార్డులను అధిగమించే స్థాయిలో టెలివిజన్లను టెలివిజన్లను విక్రయించింది. ఇది 32 నుంచి 65 అంగుళాల పరిమాణంలో ఉన్న అన్ని మోడల్‌లు, బడ్జెట్లలో కొనుగోలుదారులకు అద్భుతమైన ఎంపికలుగా నిరూపించబడ్డాయి మరియు ఫ్లిప్‌కార్ట్‌లో 4.6 రేటింగ్‌తో ప్రశంసలు అందుకున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో టీవీలు మరియు ఉపకరణాలపై 70% వరకు తగ్గింపు మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. లాంచ్ సందర్భంలో భారతదేశంలోని బ్లావ్‌పుంక్ట్ టీవీలకు ప్రత్యేకమైన బ్రాండ్ లైసెన్సీ ఎస్పిపిఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ, “మేము ప్రారంభం నుంచి అద్భుతమైన స్థాయిని దక్కించుకున్నాము. ఇది మా ప్రియమైన వినియోగదారులు మాపై ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. మరింత సమగ్రమైన డిజిటల్ ఇండియాను రూపొందించాలన్న నిబద్ధతకు అనుగుణంగా, ఫ్లిప్‌కార్ట్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రెండు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. వీటిని కొనుగోలు చేసుకునే వినియోగదారులకు నాణ్యత మరియు ప్రీమియం ప్రాధాన్యతతో సాటిలేని అనుభవాన్ని అందిస్తూ, భారతీయ వినియోగదారులకు ఏం కావాలో ఏళ్ల తరబడి అర్థం చేసుకున్న అవగాహనతో రూపొందించబడిన విభాగంలో ఇవి రెండు స్మార్ట్ టీవీలు అని మేము నిజంగా విశ్వసిస్తున్నాము. ఉత్పత్తి ఆవిష్కరణలో ఒక నమూనా మార్పును పరిశీలిస్తే, ఇవి ప్రతి భారతీయ కుటుంబానికి ఉత్తమంగా ఒదిగిపోతాయని మేము విశ్వసిస్తున్నాము’’ అని వివరించారు. ‘‘మేము ప్రతిసారీ వినియోగదారుని సంతృప్తి గురించే ఆలోచిస్తాము మరియు ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు, హై-ఎండ్ టీవీ అందించే ఫీచర్లను, బడ్జెట్-స్నేహి విభాగంలో అందుబాటులో ఉంటాయి’’ అని ఆయన వివరించారు. ఇటీవలి రిపబ్లిక్ డే సేల్ 17-20 జనవరి 2022 వరకు జరిగింది. ఈ సమయంలో బ్లావ్పుంక్ట్కు ఎక్కువ మంది వినియోగదారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బ్రాండ్ అమ్మకాలు భారతదేశ వ్యాప్తంగా 35% వృద్ధిని సాధించింది. అత్యధికంగా కొనుగోలు చేసుకున్న సంస్థ ఉత్పత్తుల్లో 43-అంగుళాలు మరియు 55-అంగుళాల మోడళ్లు ఉన్నాయి.