Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· ఈ నూతన ఈవీ డ్రైవ్‌ట్రైన్ , 2022లో విడుదల కానున్న మ్యాటర్ యొక్క రాబోతున్న 2డబ్ల్యు ఈవీ ని ముందుకు నడిపించనుంది
అహ్మదాబాద్: భావితరపు సస్టెయినబల్ పరిష్కారాలను సృష్టించడంపై దృష్టి సారించిన సాంకేతిక ఆవిష్కరణల స్టార్టప్ మ్యాటర్ నేడు నూతన, అత్యున్నత వేగంతో కూడిన మిడ్ టార్క్ మ్యాటర్ డ్రైవ్ 1.0 మోటర్‌ను అభివృద్ధి చేసినట్లుగా వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థతో సహా పలు కీలక ఆవిష్కరణలను కలిగిన నూతన ఇంటిలిజెంట్ డ్రైవ్ ట్రైన్ తో కూడిన విప్లవాత్మకమైన మోటర్ ఇది. మాగ్నెటిజం, మెటీరియల్స్ మరియు కూలింగ్‌ను వినియోగించే విధానాన్ని పూర్తిగా సమీక్షించే రీతిలోని ఈ ఆవిష్కరణ విస్తృత శ్రేణి , సమర్థవంతమైన డ్రైవ్ ట్రైన్ అందిస్తుంది.
మ్యాటర్ ఫౌండర్– సీఈవో మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ ‘‘నేడు మాకు గర్వ కారణంగా నిలిచిన క్షణం ఏమిటంటే, మా ఆవిష్కరణల సంస్కృతి, విద్యుత్ వాహనాలకు సంబంధించి బహుళ విభాగాలలో కీలక సాంకేతికతలకు తోడ్పాటునందిస్తుండటం. సస్టెయినబల్ మరియు ఆవిష్కరణల భారతానికి ఓ ఆకృతిని అందించే భవిష్యత్‌ను నూతన తరపు మొబిలిటీ మరియు శక్తి పరిష్కారాలతో తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థ తో కూడిన వినూత్నమైన మ్యాటర్ డ్రైవ్ 1,0 , సాంకేతికత మరియు డిజైన్ పరంగా పూర్తి భిన్నమైనది. మా ఫ్యూచరిస్టిక్ డ్రైవ్ ట్రైన్ ఇప్పుడు మా రాబోతున్న పెర్ఫార్మెన్స్ ఈవీలకు తగిన శక్తిని అందించనున్నాయి. మా గ్రౌండ్ అప్ విధానంతో , నేటి ప్రపంచంలో ఈవీలు కనిపిస్తున్న విధానాన్ని సమూలంగా మార్చనున్నాము’’ అని అన్నారు.
రేడియల్ ఫ్లక్స్ మోటర్ మ్యాటర్ డ్రైవ్ 1.0 , దీనిలో..
· గరిష్ట టార్క్ డెలివరీ కోసం విప్లవాత్మకమైన ఆర్కిటెక్చర్ ఉంది
· లైట్‌వెయిట్ డ్రైవ్ ట్రైన్ చేరుకోవడం కోసం అత్యాధునిక మెటీరియల్స్
· ఈ శ్రేణిలో మొట్టమొదటి సారిగా యాక్టివ్ లిక్విడ్ కూలింగ్
స్పీడ్ శ్రేణి అంతటా స్ధిరంగా టార్క్ ను అందించడంతో పాటుగా భద్రతను నిర్థారించేటప్పుడు మెరుగైన పనితీరు,సామర్థ్యాన్ని అందించడానికి బహుళ స్పీడ్ ట్రాన్స్మిషన్ అవకాశాలనూ తెరుస్తుంది.
సమర్థవంతమైన, సురక్షితమైన, పనితీరు ఆధారిత ఈవీలు మరీ ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో థర్మల్ మేనేజ్మెంట్ కీలకమని మ్యాటర్ నమ్ముతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, మేము మోటర్ యొక్క పనితీరు, భద్రత మరియు విశ్వసనీయతకు ప్రాధాన్యతనందించాము. ఇది మా రాబోతున్న 2డబ్ల్యు పెర్ఫార్మెన్స్ ఈవీలకు తగిన శక్తిని అందించనుంది. సాంకేతిక ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ డిజైన్ యొక్క శక్తివంతమైన సమ్మేళనంగా ఈ కూలింగ్ వ్యవస్థ ఉంటుంది. పవర్ మేనేజ్మెంట్ పరంగా విప్లవాత్మకతను తీసుకురావడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా మోటర్ నుంచి టార్క్ డెలివరీని సైతం అందిస్తుంది. ఈ వినూత్నంగా డిజైన్ చేసిన ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ ధర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థ, అన్ని రకాల పవర్ట్రైన్ విభాగాలకూ అవసరమైన ఉష్ణోగ్రత నిర్వహణ అవసరాలనూ తీరుస్తుంది.