Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. ఎన్నికల ఫలితాల ఉత్సాహంలో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 817 పాయింట్లు లేదా 1.50 శాతం పెరిగి 55,464కు చేరింది. మూడు సెసన్లలో 2,621 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపర్ల సంపద రూ.10.83 లక్షల కోట్లు పెరగ్గా.. బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2,51,93,934 కోట్లకు చేరింది. తాజా సెషన్లో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో 1600 పాయింట్ల మేర పెరిగింది. పంజాబ్ మినహా మిగితా రాష్ట్రాల్లో బిజెపికి ఆధిక్యం పెరుగుతుందన్న రిపోర్టులతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 16,595కు చేరింది.